RRR… ‘నాటు నాటు’ సాంగ్ కి గోల్డెన్ గ్లోబ్ అవార్డు.

    రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన భారీ సినిమా RRR ఏ రేంజ్ లో విజయం సాధించిందో అందరికి తెలిసిందే. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా RRR సినిమాని, దర్శకుడు రాజమౌళిని అందరూ పొగిడేశారు. ఇక హాలీవుడ్ లో అయితే అక్కడి సినీ ప్రియులు RRR సినిమాకి ఫిదా అయిపోయారు. ప్రపంచవ్యాప్తంగా RRR సినిమా కొత్త రికార్డులు సృష్టిస్తుంది. ఇప్పటికే ఇంటర్నేషనల్ లెవల్లో అనేక అవార్డులు అందుకున్న RRR సినిమా తాజాగా మరో పెద్ద అవార్డుని అందుకుంది.
    హాలీవుడ్ లో ఆస్కార్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మిక అవార్డు అయిన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో ఇటీవల RRR నామినేట్ అవ్వగా తాజాగా ఈ అవార్డ్స్ ఫంక్షన్ నేడు ఉదయం జరిగింది. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో RRR సినిమా నుంచి నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డు దక్కించుకొని చరిత్ర సృష్టించింది. ఈ పాటకి గాను అవార్డుని కీరవాణి అందుకున్నారు. దీంతో చిత్రయూనిట్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక అభిమానులు, సినీ ప్రియులు కీరవాణికి, RRR చిత్రయూనిట్ కి అభినందనలు తెలుపుతున్నారు.

   ఇండియా నుంచి ఇప్పటివరకు దో ఆంకెన్ బారా, గాంధీ, అపూర్ సంసార్, సలాం బాంబే, మాన్ సూన్ వెడ్డింగ్ సినిమాలు నామినేట్ అవ్వగా గాంధీ సినిమాకి అందరికి బయటి వాళ్ళకే 5 అవార్డులు వచ్చాయి. మొదటి సారి AR రెహమాన్ స్లమ్ డాగ్ మిలినియర్ సినిమాకి గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకొని మొదటి ఇండియన్ గా నిలిచాడు. అనంతరం ఇప్పుడు RRR సినిమా నామినేట్ అవ్వగా ఇండియా నుంచి గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న రెండో వ్యక్తిగా కీరవాణి చరిత్ర స్రృష్టించాడు.