మహబూబాబాద్, కొత్తగూడెం జిల్లాల‎కు సీఎం కేసీఆర్..

    సీఎం కేసీఆర్ ఇవాళ మహబూబాబాద్, కొత్తగూడెం భద్రాద్రి జిల్లాల్లో పర్యటించనున్నారు. రెండు జిల్లాల్లో కలెక్టరేట్ భవనాలను ప్రారంభిస్తారు. ఉదయం మానుకోటలో కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించనున్న కేసీఆర్.. మధ్యాహ్నం కొత్తగూడెంకు చేరుకొని అక్కడ కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభిస్తారు. అదేవిధంగా రెండు జిల్లాల్లో బీఆర్ఎస్ కార్యాలయాలను సీఎం ప్రారంభిస్తారు.