హైదరాబాద్ మెట్రో టికెటింగ్ ఉద్యోగుల ఆందోళన..

     హైదరాబాద్ మెట్రో రైలు టికెటింగ్ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఎల్ బీ నగర్-మియాపూర్ కారిడార్ లోని 150 మంది మెట్రో టికెటింగ్ ఉద్యోగులు విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. మెట్రో టికెటింగ్ లో సేవలు అందిస్తున్న ఉద్యోగుల జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. జీతాలు పెంచాలని నిన్న సాయంత్రమే ఏజెన్సీకి ఉద్యోగులు సమాచారం ఇచ్చారు. కానీ ఇవాళ ఉదయం వరకు ఎలాంటి స్పందన లేకపోవడంతో 150 మంది మెట్రో టికెటింగ్ ఉద్యోగులు విధులకు హారు కాలేదు. దీంతో ఇతర ఉద్యోగులను కౌంటర్లతో కూర్చోబెట్టి మెట్రో అధికారులు టికెట్లు జారీ చేయిస్తున్నారు.  ఇతర ఉద్యోగులతో టికెట్లు జారీ చేయిస్తుండటంతో ఆలస్యం అవుతుంది. దీంతో టికెట్ల కోసం కొన్ని మెట్రో స్టేషన్ లలో ప్రయాణికులు బారులు తీరి కనిపిస్తున్నారు. ఎల్ బీనగర్-మియాపూర్ కారిడార్ లో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.