ఫిబ్రవరి 17న తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభం..

హాజరుకానున్న బీఆర్ అంబేద్కర్ మనుమడు...

      తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఫిబ్రవరి (20230 17న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ నూతన సచివాలయం ప్రారంభంకానుంది. సీఎం కేసీఆర్ పుట్టినరోజు అయి ఫిబ్రవరి 17 శుక్రవారం రోజు ఉదయం 11.30 గంటలకు తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభంకానుంది. ఈ ప్రారంభోత్సవానికి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, జేడీయూ నేత లలన్ సింగ్ హాజరుకానున్నారు. అలాగే భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ అంబేద్కర్ కూడా హాజరుకానున్నారు. నూతన సచివాలయం ప్రారంభించిన అనంతరం పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు.తెలంగాణ నూతన సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భవన్ గా నామకరణం చేసిన విషయం తెలిసిందే. అందుకే అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ అంబేద్కర్ ను సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. కేసీఆర్ ఆహ్వానం మేరకు ప్రకాశ్ అంబేద్కర్ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారని టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.