గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాల విడుదలకు హైకోర్టు అనుమతి

     తెలంగాణలో గ్రూప్-1 అభ్యర్థులకు గుడ్ న్యూస్. గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాల విడుదలకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఓ అభ్యర్థి స్థానికత వివాదంపై టీఎస్ పీఎస్ సీ అప్పీలుపై హైకోర్టులో విచారణ జరిగింది. అభ్యర్థి స్థానికత వివాదంపై కౌంటర్ దాఖలు చేయాలని టీఎస్ పీఎస్ సీకి ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రస్తుతానికి గ్రూప్-1 ప్రిలిమినరీ ఫలితాలు విడుదల చేసుకోవచ్చని హైకోర్టు సూచించింది. అభ్యర్థి స్థానికత వివాదం తర్వాత తేలుస్తామని స్పష్టం చేసింది.

   రాష్ట్రంలో 503 గ్రూప్ -1 పోస్టులకు అక్టోబర్ 16న ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. ఈ పోస్టులకు 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా వీరిలో  2,85,916 మంది అభ్యర్థులు ఎగ్జామ్ కు హాజరయ్యారు. అక్టోబర్ 29న ప్రాథమిక కీని విడుదల చేసి, అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను టీఎస్ పీఎస్ సీ స్వీకరించింది.