క్రీడలు శారీరక, మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి

*క్రీడలు శారీరక, మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయి - మేయర్ గద్వాల్ విజయలక్ష్మి*

 

 

                      క్రీడలు శారీరక, మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. శుక్రవారం విక్టరీ ప్లే గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ...జిహెచ్ఎంసి సిబ్బందికి నాలుగు రోజుల పాటు నిర్వహించిన స్పోర్ట్స్ మీట్ ఉద్యోగులకు తమ దైనందిన జీవితంలో ఎలాంటి స్ట్రెస్ లేకుండా ఉత్సాహవంతంగా పనిచేసేందుకు క్రీడలను ప్రతి ఏడాది నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులకు నాలుగు రోజుల పాటు స్పోర్ట్స్ మీట్ ను జిహెచ్ఎంసి వ్యాప్తంగా ఎల్బీనగర్ జోన్ డి.ఆర్.ఎఫ్ ట్రైనీ సెంటర్, ఫతుల్లా గూడ, విక్టరీ ప్లే గ్రౌండ్ లలో మహిళలకు, పురుషులకు ఇండోర్, ఔట్ డోర్ గేమ్ లను విజయవంతంగా నిర్వహించడమైనదని తెలిపారు.

                      జిహెచ్ఎంసి క్రీడా మైదానాలలో ప్రతి సంవత్సరం సమ్మర్ లో ప్రత్యేక శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మహిళలు క్రికెట్, వాలీబాల్ నందు పాల్గొనాలని కోరారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ మాసంలో నిర్వహించేందుకు జిహెచ్ఎంసి చర్యలు చేపడుతుంది అన్నారు. క్రీడల్లో గెలుపు ఓటమి సహజమని అన్నారు. స్పోర్ట్స్ మీట్ లో మొత్తం 2,300 మంది పాల్గొనగా అందులో జోనల్ లెవెల్ లో 1800, మల్టీ జోనల్ లెవెల్ లో 550 మంది పాల్గొన్నారని అన్నారు. స్పోర్ట్స్ మీట్ ను 9 విభాగాలైన క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, చెస్, షటిల్ బ్యాడ్మింటన్, మ్యూజికల్ ఛైర్స్, టెనీకైట్స్, క్యారమ్స్, అథ్లెటిక్స్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఇందులో గెలుపొందిన ఉద్యోగులకు మొదటి బహుమతి కు రూ. 10,000, ద్వితీయ బహుమతి రూ. 6,000, తృతీయ బహుమతి రూ. 3000 లతో పాటు జ్ఞాపికలు, మెమోంటో పత్రాలు మేయర్ అందజేశారు.  ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ స్పోర్ట్స్ విజయలక్ష్మి, జోనల్ కమిషనర్ రవి కిరణ్, జాయింట్ కమిషనర్ తిప్పర్తి యాదయ్య, డిప్యూటీ కమిషనర్ నాయక్, గేమ్స్ ఇన్ స్పెక్టర్ ఇంతియాజ్, మాధవి, వీరానంద్, శ్రీనివాస్ గౌడ్,వెంకట్ రెడ్డి, రఫ్, కోచ్ లు విజయానంద్, రిటైర్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ హరిదాసు, రాజేశ్వర్ వ్యాఖ్యాత మల్లేష్ పాల్గొన్నారు.

 


* క్రీడల్లో గెలుపొందిన జట్టుల వివరాలు*



*క్యారమ్స్ మహిళా విభాగం*

మొదటి బహుమతి:- చందన, ఎల్.బి.నగర్ జోన్,

ద్వితీయ బహుమతి:- ఎ. మంజు భార్గవి, శేరిలింగంపల్లి 

తృతీయ బహుమతి:- సబిత, సికింద్రాబాద్ జోన్,

 *షటిల్ బ్యాడ్మింటన్ పురుషుల విభాగం సింగల్*

మొదటి బహుమతి:-పి.రామ్ మోహన్ రావు, శేరిలింగంపల్లి

ద్వితీయ బహుమతి:- విష్ణు, ఎల్.బి.నగర్

తృతీయ బహుమతి:- మహేష్, చార్మినార్ జోన్

 *షటిల్ బ్యాడ్మింటన్ మహిళా విభాగం సింగల్*

మొదటి బహుమతి:-ఎం. శ్రీలత, ప్రధాన కార్యాలయం

ద్వితీయ బహుమతి: స్రవంతి, శేరిలింగంపల్లి జోన్

తృతీయ బహుమతి:- ఉషశ్రీ, చార్మినార్ జోన్,

*అథ్లెటిక్స్ (రన్నింగ్) మహిళా విభాగం 45 సం. లోపు 100 మీటర్లు*

మొదటి బహుమతి:-స్వప్న, సికింద్రాబాద్ జోన్

ద్వితీయ బహుమతి:- ఎ. శ్రావ్య, శేరిలింగంపల్లి 

తృతీయ బహుమతి:- ఎన్.లావణ్య, ఖైరతాబాద్ జోన్

 *అథ్లెటిక్స్ (రన్నింగ్) పురుషుల విభాగం 45సం. లోపు 200 మీటర్లు*

మొదటి బహుమతి:-విష్ణు, ఎల్.బి.నగర్ జోన్

ద్వితీయ బహుమతి:- కె. రమేష్, కూకట్ పల్లి 

తృతీయ బహుమతి:- అభిషేక్, ఖైరతాబాద్ జోన్

*అథ్లెటిక్స్ (రన్నింగ్) పురుషుల విభాగం 45సం. పైబడి 100 మీటర్లు*

మొదటి బహుమతి:- కె.ఆనంద్ కుమార్, ఎల్.బి.నగర్ జోన్

ద్వితీయ బహుమతి:- పి.ఇమ్మాన్యుయేల్, చార్మినార్ జోన్

తృతీయ బహుమతి:- ఎం.రవి, ఖైరతాబాద్ జోన్

*టెన్నిస్ మహిళా విభాగం*

మొదటి బహుమతి:- K. లత, ప్రధాన కార్యాలయం

ద్వితీయ బహుమతి:- శైలజ, L.B నగర్ జోన్

తృతీయ బహుమతి:- P.సుచిత్ర , చార్మినార్ జోన్

*మ్యూజికల్ చైర్ మహిళా విభాగం*

మొదటి బహుమతి:- స్రవంతి, శేరిలింగంపల్లి జోన్

ద్వితీయ బహుమతి:- సబిత, సికింద్రాబాద్ జోన్

తృతీయ బహుమతి:- ఆశ, కూకట్ పల్లి జోన్

*వాలీ బాల్ పురుషుల విభాగం*

మొదటి బహుమతి:- ప్రధాన కార్యాలయం జట్టు

ద్వితీయ బహుమతి:- ఎల్.బి.నగర్ జోన్ జట్టు

తృతీయ బహుమతి:- సికింద్రాబాద్ జోన్ జట్టు

 *చదరంగం మహిళా విభాగం*

మొదటి బహుమతి:- ఎం. యమున, చార్మినార్ జోన్

 

ద్వితీయ బహుమతి: కె.స్వరూప, సికింద్రాబాద్ జోన్

తృతీయ బహుమతి:- గోమా శర్మ, సికింద్రాబాద్ జోన్

*చదరంగం పురుషుల విభాగం*

మొదటి బహుమతి:- వరుణ్ (AEE), శేరిలింగంపల్లి జోన్

ద్వితీయ బహుమతి:- సుభాన్, ప్రధాన కార్యాలయం

తృతీయ బహుమతి:- ఎన్.సూర్య నారాయణ, ఖైరతాబాద్ జోన్ 

*క్యారమ్స్ పురుషుల విభాగం*

మొదటి బహుమతి: హమీద్, చార్మినార్ జోన్

ద్వితీయ బహుమతి:- ఇక్బాల్, ఖైరతాబాద్ జోన్

తృతీయ బహుమతి:- ఎం. శివ కుమార్, ప్రధాన కార్యాలయం

*కబడ్డీ పురుషుల విభాగం*

మొదటి బహుమతి:- LB నగర్ జోన్ జట్టు

ద్వితీయ బహుమతి: ప్రధాన కార్యాలయం జట్టు

తృతీయ బహుమతి: కూకట్ పల్లి జోన్ జట్టు

*క్రికెట్ పురుషుల విభాగం*

మొదటి బహుమతి: ప్రధాన కార్యాలయం జట్టు

ద్వితీయ బహుమతి: ఎల్. బి నగర్ జోన్ జట్టు

తృతీయ బహుమతి: శేరిలింగంపల్లి జోన్ జట్టు.