తెలంగాణ పదో తరగతి పబ్లిక్‌ పరీక్ష 2023ల విధానంలో మార్పు..

    తెలంగాణ పదో తరగతి పబ్లిక్ పరీక్షల 2023 విధానంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రశ్నపత్రాల్లో ఎస్సే ప్రశ్నల సెక్షన్‌లో ఇంటర్నల్ ఛాయిస్ తొలగించి.. ఛాయిస్‌ ప్రశ్నలను పెంచారు. మొత్తం ఆరు ప్రశ్నలు ఇస్తే.. వాటిల్లో ఏవైనా నాలుగింటికి సమాధానాలు రాస్తే సరిపోయేలా మార్పులు తీసుకొచ్చారు. ఈ మేరకు టెన్త్‌ పరీక్షల క్వశ్చన్‌ పేపర్‌ మోడల్‌ను తెలంగాణ విద్యాశాఖ సెక్రటరీ వాకాటి కరుణ జ‌న‌వ‌రి 11 (బుధవారం) ఉత్తర్వులు జారీ చేశారు. గతంలోనైతే క్వశ్చన్‌ పేపర్‌లో ప్రతి సెక్షన్‌లో ఇంటర్నల్‌ ఛాయిస్‌ మాత్రమే ఉండేది. అంటే ప్రతి ప్రశ్నలో ఏ లేదా బి అని రెండు ప్రశ్నలిస్తారు. వాటిల్లో ఏదో ఒక ప్రశ్నకు తప్పనిసరిగా జవాబు రాయవల్సి ఉంటుంది.