నూతన సంవత్సరం కానుకగా నేడు కొత్తగూడ ఫ్లైఓవర్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్...

    నూతన సంవత్సర కానుకగా కొత్త గూడ ఫ్లైఓవర్ ను జనవరి 1 ఆదివారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రారంభించారు

 గచ్చిబౌలి ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి రూ. 263 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన కొత్త గూడ గచ్చిబౌలి ఫ్లైఓవర్  2216 మీటర్లు పొడవు గల ఫ్లై ఓవర్ అందుబాటులోకి రానున్నది. నగరవాసులకు సిగ్నల్ రహిత రవాణా వ్యవస్థను పటిష్టం చేయడానికి  జిహెచ్ఎంసి ఎస్.ఆర్.డి.పి కార్యక్రమం ద్వారా
నగర వాసులకు రోడ్డు నెట్ వర్క్ పెంచడం, రవాణా సమయం తగ్గించడం, ప్రయాణ వేగాన్ని పెంచడం,  ఇంధన వనరులను తగ్గించి, చేరవలసిన గమ్యానికి సకాలంలో చేరేందుకు, ఆలస్యాన్ని  తగ్గించే ప్రయోజనాలు కల్పించేందుకు ఎస్ ఆర్ డి పి ముఖ్య ఉద్దేశ్యం.

ఈ నేపథ్యంలో  పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు జిహెచ్ఎంసి కృషి చేస్తున్నది. అందులో భాగంగానే నిధులను సమకూర్చుకొని ప్రజలకు మెరుగైన వసతులు కల్పిస్తుంది.  జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో ఎస్.ఆర్.డి.పి ద్వారా మొత్తం 41 పనులు మరో 6 పనులను  ఆర్ అండ్ బి,  హెచ్ ఎం డి ఎ, జాతీయ రహదారుల ద్వారా చేపట్టడం జరిగింది.
 
ఇతర శాఖల ద్వారా చేపట్టిన 6 పనులలో 3 పనులు పూర్తి కాగా మిగతా మూడు పనులు వివిధ ప్రగతి దశలో కలవు. ఎస్.ఆర్.డి.పి ద్వారా చేపట్టిన 41 పనులలో   31 పనులు పూర్తి కాగా కొత్తగూడ ఫ్లైఓవర్ తో 18వ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తుంది. దీంతో  మొత్తం 47 పనులలో 34 పనులు పూర్తవుతాయి.
  కొత్తగూడ గచ్చిబౌలి ప్రధాన  ఫ్లై ఓవర్ 2216 మీటర్ల పొడవు కాగా అందులో(ఎస్ ఎల్ ఎన్ టెర్మినల్ నుండి  బొటానికల్  జంక్షన్ వరకు 5 లేన్ల వెడల్పుతో, బొటానికల్ జంక్షన్ నుండి  కొత్త గూడ జంక్షన్ వరకు 6 లేన్ల వెడల్పు,  కొత్త గూడ జంక్షన్ నుండి  కొండాపూర్ ఆర్ టి ఎ ఆఫీస్ వరకు 3 లేన్ల వెడల్పు రోడ్డు ఫ్లై ఓవర్ ను పూర్తి చేశారు. 

  మజీద్ బండ నుండి బొటానికల్ జంక్షన్  ట్రాఫిక్ కోసం 2 లేన్ల గల  బొటానికల్ అప్ ర్యాంపు, హై టెక్ కొత్త గూడ, నుండి హైటెక్ సిటీ వెళ్లేందుకు   383 మీటర్ల పొడవు తో హైటెక్ సిటీ వైపు 3 లేన్ల  డౌన్ ర్యాంపు ను  ఏర్పాటు చేశారు.
 
  470 మీటర్ల పొడవు  తో 3 లేన్ల  వెడల్పుతో అండర్ పాస్ ను హాఫిజ్ పెట్ కు వెళ్లేందుకు అండర్ పాస్ ను నిర్మించారు. కొత్తగూడ ఫ్లైఓవర్ వలన వాహనదారులు, దాని చుట్టూ ఉన్న కాలనీ లు, పరిసరాల వారికి ఈ బ్రిడ్జి వలన మౌలిక ప్రయోజనం పొందుతారు. అందులో బొటానికల్ గార్డెన్, కొత్తగూడ, కొండాపూర్ జంక్షన్ ల మధ్య చాలా తక్కువ దూరంలో ఉన్న కూడళ్ల నుండి సాఫిగా వెళ్లేందుకు వెసులుబాటు ఉంటుంది. దానికి తోడు ప్రస్తుతం ఉన్న గ్రేడ్ కారిడార్ కు ఇరువైపులా వాణిజ్య పరమైన నిర్మాణాలకు ప్రయోజనం కలుగుతుంది. ఈ జంక్షన్ ల  పరిసరాల్లో అనేక సాఫ్ట్ వేర్ కంపెనీ లు ఉండడం వలన రద్దీ సమయంలో ట్రాఫిక్ సమస్య ఉండదు.

గచ్చిబౌలి నుండి మియాపూర్ వరకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుండి  హైటెక్ సిటీ వరకు కనెక్టివిటీ తో పాటు మియాపూర్, హై టెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిసర  ప్రాంతాలను కలుపుతుంది. ఫ్లై ఓవర్ వలన బొటానికల్ గార్డెన్ జంక్షన్ కొత్తగూడ జంక్షన్ లలో 100 శాతం ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవడమే కాకుండా  కొండాపూర్ జంక్షన్ లో 65 శాతం ట్రాఫిక్ సమస్య తీరుతుంది.నూతన సంవత్సర కానుకగా కొత్త గూడ ఫ్లైఓవర్ ను జనవరి 1 ఆదివారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రారంభించనున్నారు. 

 గచ్చిబౌలి ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి రూ. 263 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన కొత్త గూడ గచ్చిబౌలి ఫ్లైఓవర్  2216 మీటర్లు పొడవు గల ఫ్లై ఓవర్ అందుబాటులోకి రానున్నది. నగరవాసులకు సిగ్నల్ రహిత రవాణా వ్యవస్థను పటిష్టం చేయడానికి  జిహెచ్ఎంసి ఎస్.ఆర్.డి.పి కార్యక్రమం ద్వారా
నగర వాసులకు రోడ్డు నెట్ వర్క్ పెంచడం, రవాణా సమయం తగ్గించడం, ప్రయాణ వేగాన్ని పెంచడం,  ఇంధన వనరులను తగ్గించి, చేరవలసిన గమ్యానికి సకాలంలో చేరేందుకు, ఆలస్యాన్ని  తగ్గించే ప్రయోజనాలు కల్పించేందుకు ఎస్ ఆర్ డి పి ముఖ్య ఉద్దేశ్యం.

ఈ నేపథ్యంలో  పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు జిహెచ్ఎంసి కృషి చేస్తున్నది. అందులో భాగంగానే నిధులను సమకూర్చుకొని ప్రజలకు మెరుగైన వసతులు కల్పిస్తుంది.  జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో ఎస్.ఆర్.డి.పి ద్వారా మొత్తం 41 పనులు మరో 6 పనులను  ఆర్ అండ్ బి,  హెచ్ ఎం డి ఎ, జాతీయ రహదారుల ద్వారా చేపట్టడం జరిగింది.
 
ఇతర శాఖల ద్వారా చేపట్టిన 6 పనులలో 3 పనులు పూర్తి కాగా మిగతా మూడు పనులు వివిధ ప్రగతి దశలో కలవు. ఎస్.ఆర్.డి.పి ద్వారా చేపట్టిన 41 పనులలో   31 పనులు పూర్తి కాగా కొత్తగూడ ఫ్లైఓవర్ తో 18వ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తుంది. దీంతో  మొత్తం 47 పనులలో 34 పనులు పూర్తవుతాయి.
  కొత్తగూడ గచ్చిబౌలి ప్రధాన  ఫ్లై ఓవర్ 2216 మీటర్ల పొడవు కాగా అందులో(ఎస్ ఎల్ ఎన్ టెర్మినల్ నుండి  బొటానికల్  జంక్షన్ వరకు 5 లేన్ల వెడల్పుతో, బొటానికల్ జంక్షన్ నుండి  కొత్త గూడ జంక్షన్ వరకు 6 లేన్ల వెడల్పు,  కొత్త గూడ జంక్షన్ నుండి  కొండాపూర్ ఆర్ టి ఎ ఆఫీస్ వరకు 3 లేన్ల వెడల్పు రోడ్డు ఫ్లై ఓవర్ ను పూర్తి చేశారు. 

  మజీద్ బండ నుండి బొటానికల్ జంక్షన్  ట్రాఫిక్ కోసం 2 లేన్ల గల  బొటానికల్ అప్ ర్యాంపు, హై టెక్ కొత్త గూడ, నుండి హైటెక్ సిటీ వెళ్లేందుకు   383 మీటర్ల పొడవు తో హైటెక్ సిటీ వైపు 3 లేన్ల  డౌన్ ర్యాంపు ను  ఏర్పాటు చేశారు.
 
  470 మీటర్ల పొడవు  తో 3 లేన్ల  వెడల్పుతో అండర్ పాస్ ను హాఫిజ్ పెట్ కు వెళ్లేందుకు అండర్ పాస్ ను నిర్మించారు. కొత్తగూడ ఫ్లైఓవర్ వలన వాహనదారులు, దాని చుట్టూ ఉన్న కాలనీ లు, పరిసరాల వారికి ఈ బ్రిడ్జి వలన మౌలిక ప్రయోజనం పొందుతారు. అందులో బొటానికల్ గార్డెన్, కొత్తగూడ, కొండాపూర్ జంక్షన్ ల మధ్య చాలా తక్కువ దూరంలో ఉన్న కూడళ్ల నుండి సాఫిగా వెళ్లేందుకు వెసులుబాటు ఉంటుంది. దానికి తోడు ప్రస్తుతం ఉన్న గ్రేడ్ కారిడార్ కు ఇరువైపులా వాణిజ్య పరమైన నిర్మాణాలకు ప్రయోజనం కలుగుతుంది. ఈ జంక్షన్ ల  పరిసరాల్లో అనేక సాఫ్ట్ వేర్ కంపెనీ లు ఉండడం వలన రద్దీ సమయంలో ట్రాఫిక్ సమస్య ఉండదు.

గచ్చిబౌలి నుండి మియాపూర్ వరకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుండి  హైటెక్ సిటీ వరకు కనెక్టివిటీ తో పాటు మియాపూర్, హై టెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిసర  ప్రాంతాలను కలుపుతుంది. ఫ్లై ఓవర్ వలన బొటానికల్ గార్డెన్ జంక్షన్ కొత్తగూడ జంక్షన్ లలో 100 శాతం ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవడమే కాకుండా  కొండాపూర్ జంక్షన్ లో 65 శాతం ట్రాఫిక్ సమస్య తీరుతుంది.