భారీ బడ్జెట్ ను ఆమోదించిన కౌన్సిల్...

    మూడవ బడ్జెట్, 5వ సాధారణ సమావేశంలో ఎజెండా ప్రకారంగా ముందుగా 2023-24 ఆర్థిక సంవత్సరపు రూ. 6,224 బడ్జెట్ ను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కౌన్సిల్ ముందు ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ను చర్చించిన కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.  
   తదనంతరం సాధారణ సమావేశంలో సభ్యులందరూ వివిధ ప్రశ్నల పై మాట్లాడాలని మేయర్ కోరగా ఏ.ఐ.ఎం.ఐ.ఎం, బీ.ఆర్.ఎస్, కాంగ్రెస్ సభ్యులు చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బి.జె.పి  సభ్యులు పదే పదే సభకు అంతరాయం కలిగించే ప్రయత్నం చేయగా సభను ఒక సారి పది నిమిషాల పాటు మేయర్ వాయిదా వేశారు.

     సభను సజావుగా నడిపించేందుకు సహకరించాలని మేయర్ బి.జె.పి సభ్యులను కోరారు. ప్రజా సమస్యలపై చర్చించడం కోసం బి.జె.పి కి కావాల్సిన సమయం ఇస్తానని మేయర్ విజ్ఞప్తి చేసినప్పటికీ బి.జె.పి సభ్యులు పట్టు విడవకుండా పోడెం చుట్టూ నిలబడి సభను అంతరాయం కల్పించారు. దానితో మేయర్ ఆగ్రహించారు. కార్యకలాపాలకు అంతరాయం కల్పిస్తే మిమ్ములను సస్పెండ్ చేయాల్సి వస్తుందని హెచ్చరించినా  వారు మాత్రం పద్దతి మానుకోకపోవడంతో మరోసారి విజ్ఝప్తి చేసి మరోసారి 15 నిమిషాల పాటు కౌన్సిల్ ను వాయిదా వేశారు. 15 నిమిషాల తర్వాత తిరిగి సమావేశం ప్రారంభమైంది. మళ్లీ బి.జె.పి సభ్యులు పోడియం దగ్గరకు రావడంతో ప్రజా సమస్యల పై చర్చించడంలో విఫలమయినవారు మాత్రమే ఇలాంటి చర్యలకు పాల్పడుతారని మేయర్ అన్నారు. 

    దీంతో సమావేశంలో బడ్జెట్ ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నట్లు, అదేవిధంగా స్టాండింగ్ కమిటీకి సంబంధించిన తీర్మానాలను ఆమోదించినట్లు మేయర్ ప్రకటించారు. ఆ తర్వాత సాధారణ సమావేశంలో ఎజెండా ప్రకారం ముందుగా బి.జె.పి సభ్యులకు అవకాశం ఇచ్చినా వారు వినియోగించుకోకపోవడంతో తరువాత ప్రశ్నను ఏ.ఐ.ఎం.ఐ.ఎం సభ్యులు, టి.ఆర్.ఎస్, కాంగ్రెస్ సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానం వివరిస్తుండగానే మళ్లీ బి.జె.పి సభ్యులు గొడవ చేయడంతో కౌన్సిల్ సమావేశాన్ని ముగించారు. 

    ఈ సందర్భంగా గత ఆర్థిక సంవత్సరంలో ఆమోదించిన రూ. 6,150 కోట్ల బడ్జెట్ ను సవరించి రూ. 6,475 కోట్లకు కమిటీ ఆమోదం తెలిపింది. 
        ఈ సమావేశంలో కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్, ఇ.వి.డి.ఎం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, ఇ.ఎన్.సి జియా ఉద్దీన్, సి.ఇ దేవానంద్, అడిషనల్ కమిషనర్లు జయరాజ్ కెనడీ, బి.సంతోష్, శృతిఓజా, ప్రియాంక అలా, వి.కృష్ణ, విజయలక్ష్మి, సి.సి.పి దేవేందర్ రెడ్డి, అడిషనల్ సి.పి శ్రీనివాస్, జోనల్ కమిషనర్లు రవికిరణ్, మమత, శ్రీనివాస్ రెడ్డి, అశోక్ సామ్రాట్, శంకరయ్య, పంకజ తదితరులు పాల్గొన్నారు.