ఐటి ఎరియాలో ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ కు చెక్.

                   గ్రేటర్ హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసి చెపట్టిన వ్యూహాత్మక రహదారుల ప్రాజెక్టులో చెపట్టిన జంక్షన్ అభివృద్ది పనులు ఒక్కటోక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి. సిటీలోని ప్రధాన ప్రాంతాల్లోని జంక్షన్ ఇంప్రూవ్ మెంట్ పనులను దాదాపు 29వేల 500 కోట్లతో చేపట్టాలని డిసైడ్ చేసిన అధికారులు...., పలు ప్రాంతాల్లో పనులు ప్రారంభించి కంప్లీట్ చేస్తున్నారు.  అందుబాటులోకి వస్తున్న ప్లై ఒవర్లు అండర్ పాస్ లు.. రైల్వే ఓవర్ బ్రిడ్జి లు... అండర్ బ్రిడ్జిలతో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ కష్టాలు తీరుతున్నాయి. ప్రదానంగా ఐటీ ప్రాంతంలో అందుబాటులోకి వస్తున్న ప్రాజెక్టు లతో ట్రాఫిక్ కు చెక్ పడుతున్నది.

       

                                           హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ జంజాటానికి చెక్ పెట్టేందుకు రూపోందించిన వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకంలోని ఫలితాలు ఒక్కటొక్కటిగా సిటిజన్ కు అందుతున్నాయి. నగరంలో వివిధ ప్రాంతాల్లోని జంక్షన్ల వద్ద భారీ ట్రాఫిక్ జామ్ లతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యే సిటిజన్స్ కు ఇప్పుడిప్పుడే ఉపశమనం కలుగుతుంది. గ్రేటర్లో వేలాది కోట్ల రూపాయలతో చేపట్టిన పనులు వేగంగా పూర్తి అవుతుండటంతో పలు జంక్షన్ల వద్ద పనులు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రదానంగా ఐటి ప్రాంతంలో జెఎన్టీయు  కుకట్ పల్లి నుండి గచ్చిబౌలి బయోడైవర్సీటి జంక్షన్ వరకు చెపట్టిన  జంక్షన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో  నాలుగు జంక్షన్లలో ఆరు ప్రాజెక్టులతో ఐటి ఎరియాలో చాల వరకు ట్రాపిక్ కు చెక్ పడింది.   కుకట్ పల్లి, మూసాపేట్, బాలానగర్ ఎర్రగడ్డ ప్రాంతాలనుండి ఐటీ ప్రాంతాలకు వెళ్లే వారికి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేసిన కైతలాపూర్ రైల్వే ఓవర్ బ్రిడ్జితో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోతాయి.  ఇక తాజాగా ఐటి ఎరియాలో 466 కోట్ల రూపాయలతో  నిర్మాణం పూర్తయిన మరో భారీ ప్రాజెక్టును మున్సిపల్ శాఖా మంత్రి కేటిఆర్. దాదాపు 1700మీటర్ల మేరా నిర్మించిన ప్లై ఒవర్ సివిల్ నిర్మాణానికి 257 కోట్ల రూాపాయలు ఖర్చు చేసింది జిహెచ్ఎంసి.  భూసేకరణకు  43కోట్లు ఖర్చు చేయ్యగా.., 166 కోట్ల రూపాయల టి డి ఆర్ ను విడుదల చేశారు అధికారులు.   ఈ ప్రాజెక్టుతో హైటెక్ సిటి ఔటర్ రింగ్ రోడ్డు మార్గంలో ట్రాఫిక్ రద్దీ కి బ్రేక్ పడుతుంది. ఔటర్ రింగ్ రోడ్డు నుండి ఐటి ఎరియాకు.., జూబ్లీ హిల్స్..,    కూకట్పల్లి.., మూసాపేట్.., బాలనగర్ ప్రాంతాల వారు ఈజీగా ప్రయాణం చేయవచ్చు.   నగరంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. మొదటి ధశ ఎస్ ఆర్ డి పి కోసం 8వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని.., 3500కోట్ల తో రెండవ దఫలో పనులు చెపడుతామన్నారు మంత్రి కేటిఆర్. దేశంలో ముఖ్యమైన నగరంగా నిలిపేందుకు 2015 నుండి హైదరాబాద్ రోడ్ల అభివృద్దిపై పనిచేస్తున్నామన్నారు. కోత్తగుడా కోండాపూర్ ప్రాంతాల్లోని ప్లై ఒవర్లు కూడా అందుబాటులోకి వస్తాయని అన్నారు. ఇక సిటిలో మెట్రో రెండవ ధశ పనులు ప్రారంభిస్తామని చెప్పారు కేటిఆర్. బిహెచ్ఈఎల్ నుండి లక్డికాపూల్.., నాగోల్ నుండి ఎల్బీ నగర్ 31కిలో మీటర్లు.. గచ్చిబౌలి నుండి శంషాబాద్ విమానాశ్రయం  వరకు 30 కిలో మీటర్ల మేరా మెట్రో పనులు చెపడుతామన్నారు. సిటి   డెవలప్మెంట్ ద్వారా నగరంలో ట్రాఫిక్ కష్టాలు లేకుండా చూస్తామన్నారు మంత్రి. ఇప్పటికే అనేక ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయని అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోయాన్నారు.