హైదరాబాద్‌ చేరుకున్న కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్..

     కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా నియమితులైన మాణిక్‌రావు థాక్రే తొలిసారి హైదరాబాద్‌ వచ్చారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న థాక్రేకి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఇతర సీనియర్ నేతలంతా ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆయన నేరుగా గాంధీభవన్‌ చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా మాణిక్‌రావు థాక్రే.. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌, సీఎల్పీ నేత భట్టి విక్రమార్ర, మధుయాష్కీ, పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహతో వేర్వేరుగా భేటీ అవుతారు.