శిల్పా లే ఔట్ ఫ్లై ఓవర్ త్వరలో ప్రారంభిస్తాం - మేయర్

    హైదరాబాద్ నగరం అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్నందున, అభివృద్ధికి అనుగుణంగా నగర పౌరులకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. సోమవారం మేయర్ శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ... గౌరవ ముఖ్యమంత్రి శ్రీ.కె.చంద్రశేఖర్ రావు నాయకత్వంలో గౌరవనీయులైన మున్సిపల్, పరిపాలన, ఐటీ శాఖ మంత్రి ఆదేశాల మేరకు ఎస్‌ఆర్‌డిపి, సిఆర్‌ఎంపి ఆధ్వర్యంలో వివిధ ప్రాజెక్టులను చేపట్టి  సిగ్నల్ రవాణా వ్యవస్థను మెరుగుపరచడం జరిగిందని తెలిపారు