HMC నుండి GHMC వరకు 

 

హెచ్ఎంసి నుండి జిహెచ్ఎంసి వరకు.. 

దినదిన అభివృద్ది చెందిన హైదరాబాద్..

ఎన్నికల వేల భాగ్యనగరంపై ప్రత్యేక కథనం..

 

                     చారిత్రక భాగ్యనగరానికి భారత దేశంలో ప్రత్యేక స్థానం ఉంది. నిజాంల కాలం నుంచి నేటీ వరకు దినదినాబివృద్ది చెందుతూ, తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటుంది.   నగరానికి ఎక్కడ నాంది పడింది.  హైదరాబాద్ నుండి గ్రేటర్ హైదరాబాద్ దాక సిటి పరిణామం ఎలా జరిగింది. అంశాలపై ప్రత్యేక స్టోరి. 


                     అంచెలంచెలు ఎదిగిన హైదరాబాద్....,   ప్రపంచ పటంతో తనకంటు ప్రత్యేక స్థానాన్ని పోందింది.  ఇక్కడి పాలకుల నుండి ఇక్కడి ఆహారపు అలవాట్ల వరకు అన్ని చరిత్రలో నిలిచిపోయే అంశాలే. రాజుల కాలం నుంచి ఇప్పటి వరకు చారిత్రక రాజధానిగా ఎన్నో అడుగులు ముందుకేసింది హైదరాబాద్.  దారుల్ షిఫా.. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్... గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్.. పేరు ఏదైతేనేమి? నగర అభివృద్ధే ధ్యేయంగా పనిచేసే వ్యవస్థకు మారు పేర్లే ఇవి. నిజాం నవాబుల కాలంలో ఒక చిన్న వీధిలో ప్రారంభమైన బల్దియా పాలన.  నేడు దక్షిణాదిలోనే అతిపెద్ద కార్పొరేషన్ గా విస్తరించింది. జీరో బడ్జెట్ నుంచి వేల కోట్ల రూపాయల ఆదాయంతో విశ్వనగరంగా రూపు దిద్దుకుంటోంది. నాటి నవాబుల పాలన నుంచి నేటి ప్రత్యేక పాలన వరకు దినదినాబివృద్ది చెందింది నగరం.

 

                     మొదట గోల్లకోండ..,  హైదరాబాద్‌..., భాగ్యనగరం..., ఇప్పుడు  గ్రేటర్‌ హైదరాబాద్‌. క్లూప్తంగా హైదరాబాద్ ప్రస్థానం ఇది.   కుతుబ్‌ షాహీ వంశంలో 5వ రాజైన మహ్మద్‌కులీకుతుబ్‌ షా 1591లో హైదరాబాద్ ను  నిర్మించారు.1948 సెప్టెంబర్‌ 17వ సైనికచర్య తరువాత భారతదేశంలో హైదరాబాద్‌ విలీనమైంది. కాల క్రమేనా  మెల్లమెల్లగా విస్తరించింది భాగ్యనగరం. 1869లో అప్పటి నిజాం నవాబు 55 చదరపు కిలోమీటర్ల విస్తీరమున్న నగరానికి తొలిసారిగా మునిసిపల్‌, రోడ్డు నిర్వహణ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఒక మునిసిపల్‌ అధికారిని నియమించారు. 1869 వరకూ సిటీ పోలీస్‌ కమిషనర్‌ అప్పట్లో కొత్వాల్‌ - ఇ- బాల్దాగా పిలిచేవారు..  నగరంలో చీఫ్‌ సిటీ మెజిస్ట్రేట్ గా, సిటీ మునిపల్‌ కమిషనర్‌గా చలామణి అయ్యేవారు. ప్రారంభంలో చాదర్‌ఘాట్‌, హైదరాబాద్‌ బోర్డులుండేవి. ఈ రెండు బోర్డులను 1933లో విలీనం చేస్తూ 1934లో మునిసిపల్‌ చట్టం ప్రకారం మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటైంది. ఆ ఏడాదిలోనే మొదటి సారి ఎన్నికలు జరిగాయి. 1937లో బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ ప్రాంతాలను మునిసిపాలిటీలో కలిపారు. అయితే ఈ కార్పొరేషన్‌ ఎక్కువ కాలం ఉండలేదు. 1942లో అధికారులతో ఏర్పడిన వివాదాల కారణంగా ఈ కార్పొరేషన్‌ రద్దు చేశారు. ప్రత్యేక అధికారి నియామకంమునిసిపల్‌ కార్పొరేషన్‌ రద్దు కావడంతో మునిసిపల్‌ కార్పొరేషన్‌ వ్యవహారాలను పర్యవేక్షించడానికి ఓ ప్రభుత్వ ఉద్యోగిని ప్రత్యేక అధికారిగా నియమించారు. ఇప్పటి స్పెషల్‌ ఆఫీసర్‌ మాదిరిగా అప్పట్లో మునిసిపల్‌ కార్యక్రమాలను చక్కబెట్టేవారు. 1950 హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ యాక్ట్‌ ప్రకారం జంటనగరాలైన సికింద్రాబాద్‌, హైదరాబాద్‌లను ప్రత్యేకమైన కార్పొరేషన్‌లుగా గుర్తించారు. 1951 వరకు కార్పొరేషన్‌ ప్రత్యేక అధికారి హాయంలోనే ఉంది.

  

                         ఎంసీహెచ్‌ ఏర్పాటు1960 ఆగస్టు ముడవ తేది నుండి  హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్లను కలిపి మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ హైదరాబాద్‌గా రూపోందించింది ప్రభుత్వం. అప్పుడు కార్పోరేషన్ 73చదరపు కిలోమీటర్ వైశాల్యం. 1951 నుంచి 1960 వరకూ బల్దియాలో 66 వార్డులు ఉన్నాయి. తరువాత ఈ వార్డులను 94కు పెంచారు. 1970 వరకు ఈ సంఖ్యతోనే ఉన్నాయి. 1986లో మరో ఆరు వార్డులు పెరగడంలో వంద వార్డులయ్యాయి. అప్పటి నుండి  జీహెచ్‌ఎంసీ ఏర్పాటు అయ్యేవరకు  వార్డుల సంఖ్య 100గా ఉంది. ఈ 100వార్డుల ప్రాంతాన్ని మున్సిపల్ కార్పోరేషన్ ఆఫ్ హైదరాబాద్   పిలిచేవారు. 2007వరకు 100డివిజన్లు..., నాలుగు జోన్లు..., ఎడు సర్కిళ్లతో ఎంసిహెచ్ ఉండేది.   2007 జిహెచ్ఎంసి ఎర్పాటు అయ్యేవరకు పాలన అంతా ఎంసిహెచ్ నిర్వహించింది.
 

 

                       ఎన్నో అడ్డంకులు ఎన్నో అభివృద్ది పనులతో కార్పోరేషన్ సిటిజన్స్ కు సేవలందిస్తూ ముందుకెళ్తుంది. కోంత కాలం మేయర్లు పాలకమండలి పరిపాలన మరికోంత కాలం స్సెషల్ఆఫిసర్ల పరిపాలన  సాగింది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో. నిజాంల రాజదానికిగా ఉన్న హైదరాబాద్ గ్లోబల్  సిటిగా ప్రస్తుతం అవతరించింది. పుట్టుక నుండి చావును దృవీకరించే వరకు ఉదయం లేచింది మొదలు రాత్రీ పడుకునే వరకు అనేక  సేవలు సిటిజన్స్ కు బల్దియా అందిస్తుంది. జీహెచ్‌ఎంసీ -గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్.. అప్పటి వరకు ఉన్న  ఎంసీహెచ్‌ ని కాస్తా జీహెచ్‌ఎంసీగా  2007 ఎప్రిల్ 16వ తేదీన ప్రభుత్వం రూపోందించింది. హైదరాబాద్ నగరం చుట్టు పక్కల ఉన్న 12  మునిసిపాలిటీలు, 8 గ్రామ పంచాయితీలను కలిపి జీహెచ్‌ఎంసీగా ఏరర్పాటు చేశారు. అప్పటి వరకు ఉన్న 179 చదరపు కిలోమీటర్లలో  ప్రాంతంలో  452.92 చదరపు కిలోమీటర్ల కలుపుకుని మొత్తం గ్రేటర్‌ హైదరాబాద్  విస్తీర్ణం 625.52 చదరపు కిలోమీటర్లుకు విస్తరించింది. 18 సర్కిళ్లుగా నాగులు జోన్లుగా ఉన్న పాలనా వ్యవస్థ క్రమ క్రమంగా విస్తరిస్తూ 30సర్కిళ్లు..., 6జోన్లుగా మారింది.  అప్పటి నుండి ఇప్పటి వరకు 150మంది కార్పోరేటర్లతో పాలకమండలి సభ్యుల గ్రేటర్ పాలన సాగుతూ వస్తుంది.

 

                    హైదరాబాద్ పాలన నిర్వహించిన మేయర్లలో చాలా మంది తరువాత ఉన్నత నాయకులుగా ఎదిగారు. 1952-54వరకు  మాడపాటి హనుమంతరావు మొదటి మేయర్ గా పనిచేశారు. తరువాత  1954-55 వరకు  ధరణీధర్‌ సంఘీ..., షాబుద్ధీన్‌ అహ్మద్‌ ఖాన్‌ 1955-56 వరకు.., కిషన్‌ లాల్‌ 1956-58 వరకు.., కృష్ణస్వామి ముదిరాజ్‌ 1958-59.., రోషన్‌ అలీ ఖాన్‌ 1959-60 వరకు ..., వేదప్రకాష్‌  1960-61వరకు.., రామమూర్తి నాయుడు  1961-62వరకు..రాణీ కుముదినీ దేవి 1962-63వరకు..., బనారసీలాల్‌ గుప్ 1963-64వరకు.., ఎంఆర్‌ శ్యామ్‌రావ్‌ 1964-65వరకు...,  సరోజినీ పుల్లారెడ్డి 1965-66వరకు..., అక్బర్ అలీ అన్సారీ 1966-67..,  కె. కొండారెడ్డి 1967-68వరకు.., బీ .కుముద్‌ నాయక్‌ 1968-69 వరకు..., ఎన్‌ లక్ష్మీనారాయణ 1969-70 వరకు.., కె.ప్రకాశ్‌రావు1986-87 వరకు.., ఎంకె మోబిన్‌  1987-88 వరకు.., అనుమల్లా సత్యనారాయణ రావు 1988-89 వరకు..., మిర్‌ ఝులిఫికర్‌ అలీ 1989-90 వరకు...,  అల్లంపల్లి పోచయ్య 1990-91 వరకు ...., తీగల కృష్ణారెడ్డి 2002 నుంచి  2007 వరకు..., బండ కార్తీక రెడ్డి  2009-2011 వరకు మహ్మద్‌ మజీద్‌ హుస్సేన్‌ 2011-2014 వరకు మేయర్లుగా వ్యవహరించారు. తరువాత   బొంతు రామ్మోహన్   2016  నుంచి ఇప్పటి వరకు  జిహెచ్ఎంసి మేయర్ గా వ్యవహారిస్తున్నారు.

    

                      ఎంసిహెచ్..., జిహెచ్ఎంసి ప్రజలు ఎన్నుకున్న పాలకమండలి పాలనతోపాటు అనేక ఎళ్లు స్సెషల్ ఆఫిర్స్ పాలనలో కూడా ఉండిపోయింది. ప్రభుత్వం నిర్ణయించిన స్సెషల్ ఆఫిసర్లు అనేక ఎళ్లపాటు బల్దియా పాలనను నిర్వహించారు.   మునిసిప్‌ కార్పొరేషన్‌ పాలక మండలి రద్దు అయినప్పుడు ప్రతి సారి ప్రత్యేక అధికారిని నియమించి పానల సాగిస్తుంది ప్రభుత్వం.   1970 నుంచి 1986 వరకూ బల్దియాలో స్పెషల్‌ ఆఫీసర్‌ పాలన కింద కొనసాగింది. తరవాత మేయర్ల పాలనలో ఉన్న జిహెచ్ఎంసి 1993 నుంచి 2002 వరకూ 10 సంవత్సరాలు మళ్లీ బల్దీయా స్పెషల్‌ ఆఫీసర్‌ పాలన కిందనే ఉంది. 2007లో పాలక వర్గం గడువు ముగిసిన తర్వాత రెండు మాసాల పాటు ఎస్‌పీ సింగ్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ మరియు ఇంచార్జి కమిషనర్‌గా కొనసాగారు. జీహెచ్‌ఎంసీని ప్రకటించిన తరువాత సీవీఎస్‌కె శర్మ గ్రేటర్‌ హైదరాబాద్‌కు మొదటి కమిషనర్‌ మరియు స్పెషల్‌ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. ఎస్సి సింగ్..., మరియు కృష్ణ బాబు స్సెషల్ అధికారులుగా వ్యవహరించారు. తరువాత   సోమేష్ కుమార్ స్సెషల్ ఆఫిసర్ గా వ్యవహరించారు.  పాలన వ్యవస్థ ప్రస్తుతం ఉన్న కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ ఉన్న భవనం ధారుల్ షిఫా నుండి.,..., 1980వ దశకంలో ప్రస్తుతం ఉన్న జిహెచ్ఎంసి కార్యాలయానికి పాలన వచ్చింది. అప్పటి నుండి ఇప్పటి వరకు లీబర్టీ వద్ద గల ప్రదాన కార్యాలయం నుండి పాతన సాగుతుంది. ప్రారంభంలో హైదారబాద్ మున్సిపల్ కార్పోరేషన్.., తారువాత మున్సిపల్ కార్పోరేషన్ ఆఫ్ హైదరాబాద్..., ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ జిహెచ్ఎంసి పరిణామ క్రమం ఇది.

 

                   ఒకప్పుడు కేవలం మెయింటేనేన్స్ పనులను మాత్రమే చేసే జిహెచ్ఎంసి ఇప్పుడు చాలా అబివృద్ది పనులపై ఫోకస్ చేస్తుంది. 1960లో 1కోటి50లక్షలుగా ఉన్న బడ్టెట్ 2006నాటకి 400కోట్లకు చెరింది. ప్రస్తుం అది 5600కోట్లుగా ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో తిరుపతి ఎడుకోండల వెంకటేశుడి బోర్డు ఆదాయం తరువాత అదిక ఆదాయం వచ్చేది హైదరాబాద్ కార్పోరేషన్ కే. దేశవ్యాప్తంగా ఆస్తులు ఉన్నట్లుగానే గ్రేటర్ పరిదిలో వేలాది కోట్ల రూపాయల ఆస్తులు బల్దియాకు ఉన్నాయి. 2015వరకు ఫిక్స్ డ్ డిపాజిట్లతో ఉన్న జిహెచ్ఎంసి ఇప్పుడు అప్పులు చేస్తూ అబివృద్ది కార్యక్రమాలు చెపట్టింది. ఇక 1950దశంలో 10లక్షలు హైదరాబాద్ జనబా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు అది పది రేట్లు పెరిగా కోటికి పైగా చేరింది. దాంతో పాలన వ్యవస్థను పూర్తి గా వికేంద్రికరిస్తూ 150వార్డులు..., 30 సర్కిళ్లు.., 6 జోన్స్ గా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పాలన సాగుతుంది.  జిహెచ్ఎంసి ఎన్నికలవెళ మరోసారి హైదరాబాద్ పాలన వ్యవహారం సిటిజన్స్ చర్చించు కుంటున్నారు.