'ఘన'మే ఘనం!!..

అధిక బరువు తగ్గేంచుకునేందుకు మన చాలా చిట్కాలు పాటిస్తుంటాం. బరువు తగ్గించుకునేందుకు ఎవరు ఏ చిట్కా చెబితే అది పాటిస్తుంటాం. ఏ ఫుడ్ తినమని ప్రిఫర్ చేస్తే అవే తింటుంటాం. ఉదయాన్నే గోరు వెచ్చటి నీటితో తేనెను కలిపి తీసుకుంటే..ఇంకొందరు అన్నం తినడం మానేసి కేవలం పండ్ల రసాలు మాత్రమే తీసుకుంటుంటారు. అయితే కేవలం పండ్లను జ్యూస్ లుగా మార్చి ఎక్కువ ద్రవంగా తయారు చేసిన వాటిని తాగినంత మాత్రాన బరువు తగ్గొచ్చా? అన్న ప్రశ్నకు డైటీషియన్లు అడిగితే కాదనే సమాధానమిస్తున్నారు. దీనివల్ల బరువు తగ్గకపోగా ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
ద్రవ పదార్ధాలతో ఆరోగ్యంపై ప్రభావం..
ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఏక్టివ్ గా పనిచేసేందుకు అవసరమైన శక్తి 'ఘన ఆహారంవల్లే లభిస్తుందన్నది నిపుణులు చెబుతుఆన్నారు. అంతేతప్ప కేవలం జ్యూస్ లు, ఇతర ద్రవ పదార్ధాల వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందకుంటాపోతాయంటున్నారు. అలా చేస్తే సాయంత్రం అయ్యేసరికి అలసిపోయి నీరసించిపోతారట. అంతేకాదు ఇలా చేస్తే దీర్ఘకాలంలో ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం వుంటుందంటున్నారు.

ఘనాహారంతోనే ప్రొటీన్లుమిటమిన్లు..
ఆరోగ్యంగా ఉండేందుకు శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు, విటమిన్లు, కార్పొహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు చాలా అవసరం. ఇవి ద్రవ పదార్ధాలలో అంటే పండ్ల రసాలలో లభించవు. దీంతో బీపీ తో పాటు షుగర్ స్థాయిలో పలు మార్పులు చోటుచేసుకుని జీర్ణ వ్యవస్థ దెబ్బతినడం వంటి అనర్ధాలు జరుగుతాయట.