5,600 కోట్ల బడ్జెట్ కు స్టాండింగ్ కమీటి అమోదం

 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ. 5,600 కోట్ల బడ్జెట్ కు స్టాండింగ్ కమీటి అమోదం.

         

              2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ. 5,600 కోట్ల బడ్జెట్ ను ప్రతిపాదించారు అధికారులు.  ఈ ప్రతిపాదిత అంచనా బడ్జెట్ లో అత్యధికంగా 32 శాతం ఆస్తిపన్ను ద్వారా రూ. 1850 కోట్లు వస్తుందని అంచనా వేశారు.  22 శాతం నిధులు రూ. 1224.51 కోట్లు రుణాల ద్వారా సేకరించాలని నిర్ణయించారు.   17శాతం నిధులు రూ. 1022.70 కోట్లు ఫీజులు, యూజర్ చార్జీల కింద రానున్నట్లు అంచనా వేశారు.ఇక  14 శాతం నిధులు రూ. 770.51 కోట్లు ప్లాన్ గ్రాంట్ల కింద..,  13 శాతం నిధులు రూ. 652.10 కోట్లు అసైండ్ రెవెన్యూ కింద..,  3 శాతం నిధులు రూ. 189.69 కోట్లు క్రమబద్దీకరణ ఫీజుల కింద వస్తాయని..,  ఒక శాతం నిధులు రూ. 66.20 కోట్లు ఇతర రెవెన్యూ మార్గాల ద్వారా లభించనున్నాయని ముసాయిదా బడ్జెలో పెర్కోన్నారు అధికారులు అధికారులు రూపోందించిన అంచనాలపై చర్చించిన స్టాండింగ్ కమీటి సభ్యులు అమోదం తెలపారు.