హైదారబాద్ లో త్రాగునీరు ఉచిత పంపిణి ఎలా...

హైదారబాద్ లో త్రాగునీరు ఉచిత పంపిణి ఎలా...   

 

                  గ్రేటర్ ఎన్నికల్లో త్రాగునీరు ఉచిత పంపిణిపై   అన్ని పార్టీలు హామీలు ఇచ్చాయి. ముఖ్యంగా అధికార పార్టీ నేరుగా ముఖ్యమంత్రి డిసెంబర్ నుండి సిటిలో త్రాగునీటిని ఫ్రిగా సరఫారా చేస్తామని ప్రకటించడంతో...., దాని అమలు పై కసరత్తు చేస్తున్నారు హైదరాబాద్ వాటర్ సప్లై బోర్డు అధికారులు.  20కిలో లీటర్లు వరకు వినియోగించే వారికి మాత్రమే ఈ పథకం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నందునా..., మీటర్లు లేని వారికి ఎలా సరఫరా చేయ్యాలనే అంశపై బోర్డువర్గాలు దృష్టిపెట్టాయి.  ఉచిత త్రాగునీటి సరఫరా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ముఖ్యమైన హామిగా బావిస్తున్నారు నగరవాసులు. ప్రతి కుటుంబానికి 20వేల లీటర్ల వరకు ఉచితంగా త్రాగునీటిని అందిస్తామని ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రకటించడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అది ప్రభుత్వ నిర్ణయం కాబట్టి బల్దియా గెలుపోటములతో సంబందం లేకుండా అమలు అయ్యిే అవకాశం ఉంది. దాంతో గ్రేటర్ వాటర్ బోర్డు అధికారులు ఈ స్కిమ్ ను ఎలా ఇంప్లీమెంట్ చేయ్యాలనే అంశంపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది.

 

                    ప్రస్తుతం ఉచిత త్రాగునీరు దేశంలోని మెట్రో నగరాల్లో డిల్లీలో అందిస్తున్నారు. అక్కడ  ఉచిత త్రాగునీటిని దాదాపు 14లక్షల కుటుంబాలకు అందిస్తున్నట్లు సమాచారం. ఇక ఇక్కడ కూడా ఉచిత త్రాగునీటిని 20వేల లీటర్ల వరకు ఉపయోగించుకుంటున్న కుటుంబాలకు అందించాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఎక్కువ వాడుకున్న 20వేల లీటర్లు ఉచితంగా  అందిస్తారా..., లేక 20వేల లీటర్ల కంటే తక్కువ ఉంటే మాత్రమే స్కిమ్ వర్తిస్తుందా అనేది ఇంకా క్లారీటి రావాల్సి ఉంది. అయితే మొత్తంగా త్రాగునీటి సరఫరా మాత్రం లెక్కలు తీయ్యడానికి మీటర్లు అవసరం అవుతాయి. ప్రస్తుతం గ్రేటర్ కార్పోరేషన్ పరిధిలో 12లక్షల నల్లా కనెక్షన్లు ఉండగా..., అందులో 10లక్షల వరకు ఇంటివినియోగానికి వాడుతున్న నల్లాలు ఉన్నాయి. అందులో మీటర్లు కేవలం 4లక్షలు మాత్రమే ఉన్నాయి. మీటర్లు లేని వారికి.. ప్రస్తుతం డాకెట్ వైజ్ గా సరఫరా అవుతున్న నీటికిని విభజించి బిల్లులు వేస్తున్నారు.

 

                       ఉచిత త్రాగునీటి ఈ నెల నుండి అమలు చేయ్యాలంటే ఇప్పటికిప్పుడు 6లక్షల వరకు నాల్లాలకు  మీటర్లు బిగించాల్సి ఉంటుంది. అది ఇంత తక్కువ సమయంలో సాద్యమా అనే అంశాలు చర్చకు వస్తున్నాయి. మీటర్లు లేకుండా ఉచితంగా నీరు అందిస్తే కోన్ని చోట్ల అది దుర్వీనియోగం అవ్వడంతోపాటు వృదా కూడా పెరిగే అవకాశం ఉంది. కృష్ణాగోదావరి నుండి త్రాగునీటని సిటికి తరలిస్తున్న వాటర్ బోర్డు సరాసరిగా వెయ్యి లీటర్లకు 47రూపాయల వరకు ఖర్చుచేస్తుంది. అయితే డోమస్టిక్ యూజర్లకు కీలో లీటర్ 10రూపాయలు అదే మురికి వాడ్ల్లో ఉంటే 7రూపాయలు మాత్రమే వసూలు చేస్తుంది. ఖర్చుతో వస్తున్న వాటర్ వృదా కాకుండా ఉండేలా  ఎలా ముందుకు ఎళ్లాలనే అంశంపై ఫోకస్ చేస్తున్నారు అధికారులు.    అయితే ఈ హామి అమలు పై టిఆర్ ఎస్ వర్గాలు కూడా మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తుంది. నిపుణుల అభిప్రాయం తీసుకోని ముందుకు ఎలా వెళ్లాలి అనే అంశంపై దృష్టిపెట్టినట్లు సమాచారం. చూడాలి ఎప్పటి నుండి ఎలా ఈ హామి పట్టాలెక్కుతుందో.....