హైదరాబాద్ లో రాహుల్ భారత్ జోడో యాత్ర...

     కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో యాత్ర హైదరాబాద్ కు చేరుకుంది. అందులో భాగంగా శంషాబాద్ నుంచి కాలేజీ విద్యార్థులతో కలిసి రాహుల్ గాంధీ నడక సాగిస్తున్నారు. వారితో ముచ్చటిస్తూ పాదయాత్ర చేస్తున్నారు. శంషాబాద్ వద్ద ఒక విద్యార్థిని భరత నాట్యం చేస్తుందని తెలుసుకొని అక్కడే కొద్దిసేపు ఉండి రాహుల్ గాంధీ నాట్యం తిలకించారు. శంషాబాద్ వద్ద ప్రారంభమైన భారత్ జోడో యాత్ర.. ఆరాంఘర్, బహదూర్ పురా, పురానాపూల్, హుస్సేనీ ఆలం, లాడ్ బజార్, చార్మినార్, మదీన, గాంధీభవన్ మీదుగా నెక్లెస్ రోడ్డుకి చేరుకోనుంది. రాహుల్ గాంధీ రాక కోసం ఆరాంఘర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు.