హైదరాబాదులో విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో రోజురోజుకు స్వైన్ ఫ్లూ విస్తరిస్తుంది. పెరుగుతున్న స్వైన్ ఫ్లూ బాధితుల సంఖ్య హైదరాబాద్ సిటిజన్స్ను భయబ్రాంతులకు గురి చేస్తుంది. తాజాగా సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో మరో నాలుగు స్వైన్ ఫ్లూ కేసులు నమోదు అయ్యాయి. ఈ నాలుగు కేసులు షామీర్పేట్ నల్సార్ యూనివర్సిటీ కి చెందిన విద్యార్థులు గా గుర్తించారు వైద్యులు. దాంతో స్వైన్ ఫ్లూ తో చికిత్స పొందుతున్న వారి సంఖ్య గాంధీ ఆసుపత్రిలో తొమ్మిదికి చేరింది.  వీరికి తోడు మరో ఐదు మందిని స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్నట్లుగా గుర్తించారు వైద్యులు. వాతావరణంలో ఒక్కసారిగా వచ్చిన మార్పులు కారణంగానే స్వైన్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి చెందుతుంది అంటున్నారు డాక్టర్లు. చిన్నారులు వృద్ధులు గర్భిణీలు స్వైన్ ఫ్లూ వ్యాధిపట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.  మరోవైపు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో స్వైన్ ఫ్లూ వ్యాధి పంజా విసురుతుంది.