హాని చేయ్యని బాణసంచా ఒకే - సుప్రిం

హాని చేయ్యని బాణసంచా ఒకే - సుప్రీం

                 దీపావళి పండగ వేడుకలు సమీపిస్తున్న నేపథ్యంలో భాణసంచా పేల్చడంపై ఉన్నత న్యాయస్థానం కీలక ప్రకటన చేసింది. ఫైర్ క్రాకర్స్ పై పూర్తి నిషేదం లేదని ప్రకటించింది.  అయితే ప్రమాదకరంగా ఉన్న బేరియం సాల్ట్స్ ఉన్న బాణసంచాపై మాత్రం నిషేదం ఉందంటుంది స్పష్టత ఇచ్చింది సుప్రీం కోర్టు.

 

               దీపావళి వేడుకల పేరుతో ఇతరులకు ఇబ్బందులు కల్గించే అంశాన్ని ఒప్పుకునేది లేదని స్పష్టత ఇచ్చింది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్..,  చిల్డ్రన్ హెల్త్ ను  పణంగా పెట్టడం సరికాదని రాజ్యాంగంలోని 21వ అధికరణ ప్రకారం వారికి రక్షణ కల్పిస్తుందని ప్రకటించింది.  బాణసంచా తయారు చేయ్యడం, వినియోగించడం, నిషేధిత బాణసంచా అమ్మకాలకు సంబంధించి కోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రజలు తెలుసుకునేందుకు వీలుగా ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా, స్థానిక కేబుల్ సర్వీసుల ద్వారా ప్రచారం చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలను సుప్రీం న్యాయస్థానం ఆదేశించింది.