స్వచ్ ర్యాంకింగ్ లో హైద‌రాబాద్ 37వ‌ స్థానం

             2021 స్వ‌చ్ స‌ర్వేక్ష‌న్ ర్యాంకుల‌ను ప్ర‌క‌టించింది కేంద్రం. స్వ‌చ్ భార‌త్  కార్య‌క్ర‌మంలో భాగంగా సిటిల్లో  పారిశుద్యాన్ని పెంచ‌డ‌మే లక్ష్యంగా స్వ‌చ్ స‌ర్వేక్ష‌న్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించింది. హైదరాబాద్ నగరం  స్వచ్ సర్వేక్షన్ లో గతంతో పోల్చితే మెరుగుపడింది.  నేషనల్ ర్యాంకింగ్ లో గతేడాది 65వ స్థానంలో నిలువగా ఈ సారి 37 స్థానాన్ని స్వాధీనం చేసుకుంది.     దేశంలో వ‌రుస‌గా   క్లీనెస్ట్ సిటి  ర్యాంక్ ద‌క్కించుకుంది ఇండోర్ సిటి..... మొదటి పది స్థానాల్లోనూ జిహెచ్ఎంసి లేదు.  వరుసగా  ఇండోర్ ఫస్ట్ ప్లేస్ లో దక్కించుకోగా...,   గుజ‌రాత్ కు చెందినా సురత్ సెంకండ్ ప్లేస్ ద‌క్కించుకోగా...., ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన విజయవాడ మూడవ స్థానంలో నిలిచింది.

 

            పరిశుభ్రమైన భార‌తదేశం సాదించే ల‌క్ష్యంతో స్వ‌చ్ భార‌త్ మిష‌న్ ప్రారంభ‌మైంది. న‌గ‌రాలు ప‌ట్ట‌నాలు ప‌ల్లెల్లో పారిశుద్యాన్ని మెరుగు ప‌రుచ‌డంకోసం అవ‌స‌ర‌మైన కార్య‌క్ర‌మాలు ఈ మిష‌న్లో చెప‌డుతున్నారు. త‌మ త‌మ ప్రాంతాల్లో పారిశుద్యాన్ని కాపాడ‌టం.... మురుగునీటి నిర్వ‌హ‌ణ.... మ‌రుగుదోడ్ల ఎర్పాటు... త‌డిపోడి చెత్త వేరుచేయ్య‌డంతోపాటు పరిశుభ్ర‌త‌కోసం అనేక కార్య‌క్ర‌మాలు రూపోందించి అమలు చేస్తుంది కేంద్ర పట్టనాబివృద్ది శాఖ. అయితే వాటిలో మెరుగైన ఫ‌లితాలు సాధించిన వారిని గుర్తించ‌డం కోసం స్వ‌చ్ స‌ర్వేక్ష‌న్ ర్యాంకింగ్ ను నిర్వ‌హిస్తుంది.  2021 స్వ‌చ్ స‌ర్వేక్ష‌న్ ర్యాంకుల‌ను విడుద‌ల చేసింది కేంద్ర ప్ర‌భుత్వం.   మొత్తం 4320పట్టణాలు.., నగరాలు స్వచ్ సర్వేక్షన్ 2021 ర్యాకింగ్ లో పోటి పడ్డాయి.  దేశంలో క్లినెస్ట్ సిటిగా మ‌రోసారి  గుర్తింపు పోందింది మ‌ద్య‌ప్ర‌దేశ్ కు చెందిన‌ ఇండోర్ న‌గ‌రం... అయితే గ‌త ఐదేళ్లుగా క్లీన్ సిటిగా త‌న ఆదిప‌త్యాన్ని చాటుకుంటుంది ఇండోర్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్.  నేషనల్ ర్యాంకింగ్ లో రెండవ వ‌స్థానంలో నిలించింది గుజరాత్ కు చెందిన సురత్ నగరం... మూడ‌వ స్థానం  ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన విజయవాడ నిలించింది.    ఇక ప‌ది ల‌క్ష‌ల‌కు పైగా ఉన్న జ‌నాభా ఉన్న న‌గ‌రాల్లోను ఇవే నగరాలు ముందున్నాయి.  అయితే ఈసారి ఒవరాల్ ర్యాంకింగ్ లో  హైదరాబాద్ నగరం తన ర్యాంకును కోంత మెరుగు పరుచుకుంది.   2019  నేషనల్ ర్యాంకింగ్ లో 35వ స్థానంలో నిలువగా 2020లో   65వస్థానానికి పడిపోయింది. ఈ సారి కోంత మెరుగుదల సాధించింది 37 కైవసం చేసుకుంది.  

 

               మేగా సిటిల్లో క్లీన్ నెస్ట్ సిటి.., ఫాస్టెస్ట్ మూవర్ సిటి..,   సిటిజన్ ఫిడ్ బ్యాక్.., ఇన్నోవేషన్స్ అండ్ బెస్ట్ ప్రాక్టిసేస్.., సెల్ఫ్ సస్టైనేబుల్ సిటి అంశాలుగా ర్యాంకులను ప్రకటించింది కేంద్రం.  జాబితాల్లో చివరి అంశం అయిన సెల్ఫ్ సస్టైనేబుల్ సిటి జాబితాలో 40లక్షలపైగా జనాభా ఉన్న  నగరాల్లో హైదరాబాద్ మొదటి స్థానంలో  ఉంది.  ఇక నేషనల్ ర్యాంకింగ్ లో 10లక్షలపైగా జనాబా ఉన్న48 నగరాల జాబితాలో మన హైదరాబాాద్ 13వ స్థానంలో ఉంది.  ఇక క్లీనేస్ట్ సిటి జాబితాలో    వరుసగా  ఇండోర్ ఫస్ట్ ప్లేస్ లో దక్కించుకోగా...,   గుజ‌రాత్ కు చెందినా సురత్ సెంకండ్ ప్లేస్ ద‌క్కించుకోగా...., ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన విజయవాడ మూడవ స్థానంలో నిలిచింది.  ఈ జాబితాలో టాప్ 10స్థానాల్లో కూడా హైదరాబాద్ నిలువ లేదు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్  ఈ సారి నేషనల్ ర్యాంకింగ్ లో  తన ఫర్పామెన్స్ మెరుగుపరుచుకుంది.   2015లో  275వ  స్థానంలో నిలువగా 2016లో మాత్రం చాలా మంచి ప్రతిభకనబరిచి దేశవ్యాప్తంగా 19వస్థానంలో నిలిచింది. అతరువాత వరుసగా నేషనల్ ర్యాంకింగ్ లో  తన స్థాయిని కోల్పోతూ వచ్చింది హైదరాబాద్ సిటి.  2017స్వచ్ సర్వేక్షన్ ర్యాంకింగ్ లో 22వ స్థానంలో...,  2018లో 27వ స్థానంలో నిలువగా..., 2019లో 35వ స్థానంలో నిలిచింది. 2020లో 65స్థానంలో నిలిచింది.  ఇక ఈ ఏడాది 65స్థానం నుండి 37 స్థానానికి ఎగబాకింది.  మొత్తం 6000మార్కులు సాధించాల్సి ఉండగా హైదరాబాద్ 4551 మార్కులతో జాతీయ స్థాయిలో 37వ స్థానం దక్కించుకుంది. ఇక మొదటి స్థానంలో నిలిచిన ఇండోర్ సిటికి 5618మార్కులు... రెండు వస్థానంలో నలిచిన సూరత్ కు 5559మార్కులు రాగా..., మూడవ స్థానంలో నిలిచిన విజయవాడకు 5368మార్కులు వచ్చాయి.   ఎపికి చెందిన తిరుపతి 4945మార్కులతో ఎనిమిదవ స్థానంలో నిలువగా...,  4717మార్కులతో గ్రేటర్ విశాఖ 24స్థానంలో నిలించిది. తెలుగు రాష్ట్రాల్లో ఎపికి చెందిన మూడు నగరాలు టాప్ 100లో నిలువగా..., తెలంగాణ నుండి  కేవలం హైదరాబాద్ మాత్రమే స్థానం దక్కించుకుంది.   

 

                స్వ‌చ్ స‌ర్వేక్ష‌న్ లో నెంబ‌ర్ వ‌న్ ర్యాంకింగ్ కోసం అన్ని విదాల ప్ర‌య‌త్నించినప్ప‌టికి అందులో స్థానం పోంద‌క‌పోండంపై బ‌ల్దియా వ‌ర్గాలు ఒకింత అసంతృష్తితో ఉన్నాయి. గతేడాది ర్యాంకుతో పోల్చితే ఈ ఎడాది మెరుగైన ర్యాంకు రావడం సంతోషించ దగ్గవిషయమంటున్నాయి.