స్పేస్ నుంచి భూమిని చూడటం ... ఒక అద్బుతం...

  అంతరిక్షానికి వెళ్లి భూమిని చూడటం ఒక ‘అద్భుతం’ అని తెలుగు అమ్మాయి, ఇండియన్ అమెరికన్ ఆస్ట్రోనాట్ శిరీష బండ్ల చెప్పారు. ఆదివారం వర్జిన్ గెలాక్టిక్ స్పేస్ ప్లేన్​లో అంతరిక్షానికి వెళ్లి వచ్చిన ఆమె ‘ఎన్​బీసీ న్యూస్’ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘‘ఇంకా నేను అక్కడ ఉన్నట్లే ఉంది. కానీ ఇక్కడికి రావడంకూడా సంతోషమే. అంతరిక్షానికి వెళ్లి రావడం గురించి చెప్పాలంటే.. అద్భుతం అనే మాట కన్నా ఇంకా పెద్ద పదంకోసం వెతుకుతున్నా. పై నుంచి భూమిని చూడటం అనేది ఒక లైఫ్​ చేంజింగ్ ఎక్స్ పీరియెన్స్” అని శిరీష ఆనందం వ్యక్తంచేశారు. చిన్నప్పటి నుంచే స్పేస్​కు వెళ్లాలని కలలు కన్నానని, ఆ కలలు ఇప్పుడు నిజమయ్యాయన్నారు. కంటిచూపు తక్కువగా ఉండటంవల్ల నాసా ఆస్ట్రోనాట్​గా సెలక్ట్ కాలేదని గుర్తుచేసుకున్నారు. స్పేస్ ప్లేన్​లో అంతరిక్ష యాత్ర చేయాలనుకునేవాళ్లకు టికెట్ ధరను రూ. 1.86 కోట్లుగా నిర్ణయించారు. ఇది సంపన్నులకు ఒక జాలీ రైడ్​గా మాత్రమే మారుతుందా? అని ప్రశ్నించగా.. భవిష్యత్తులో అందరికీ స్పేస్ టూర్​ను అందుబాటులోకి తేవాలన్నదే వర్జిన్ గెలాక్టిక్ లక్ష్యమని శిరీష బండ్ల చెప్పారు.