సిద్దమౌతున్న షేక్ పేట్ ఫ్లై ఒవర్

 షేక్ పేట్ ఫ్లైఓవర్ త్వరలో ప్రారంభం 

                   నగర ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా  మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలని సంకల్పంతో జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో బి.టి.రోడ్లను, అవసరమైన చోట ఫ్లైఓవర్లు, బ్రిడ్జిలు, అండర్ పాస్ లు నిర్మిస్తుంది జిహెచ్ఎంసి.  హైదరాబాద్ ప్రాముఖ్యతను మరింతగా పెపొందించేందుకు విశేష కృషిచేస్తుంది. మున్సిపల్, పట్టణాభివృద్ది, ఐ.టి శాఖ మంత్రి కె.టి.ఆర్   ఆదేశాల మేరకు మేయర్ గద్వాల విజయ లక్ష్మి ఎప్పటికప్పుడు పర్యవేశిస్తూ పనుల వేగవంతంగా జరిగేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో రేతిబౌలి నుండి గచ్చిబౌలి వరకు ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు  6 లేన్ల గల రెండు ఫ్లైఓవర్లు వయా షేక్ పేట్ ఫిలింనగర్ జంక్షన్ ఓయు కాలనీ జంక్షన్, విస్పర్ వ్యాలీ జంక్షన్ వరకు నిర్మించే షేక్ పేట్ ఫ్లైఓవర్ ఇంటర్మిడియట్ రింగ్ రోడ్ నిర్మాణం త్వరలోనే పూర్తి కానున్నది.  హైటెక్ సిటీ వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రజలకు ఈ మధ్యంతర రింగ్ రోడ్ నిర్మాణం వలన ట్రాఫిక్ సమస్యలు పరిష్కారం అవుతాయి.  333.55 కోట్ల అంచనా వ్యయంతో 2.8 కిలోమీటర్ల ఫ్లైఓవర్ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకుంది.  ఫ్లైఓర్ నిర్మాణం వలన హైటెక్ సిటీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి వెళ్లేందుకు ఆ ప్రాంత ప్రజలకు సులభతరం అవుతుంది. 74 పిల్లర్స్ నిర్మాణాలు పూర్తిచేయడం జరిగింది. 72 పియర్ క్యాప్స్  పూర్తిచేయడం జరిగింది. 440 పి.ఎస్.సి గ్రీడర్స్ నిలబెట్టడం పూర్తిచేయడం జరిగింది. 144 కాంపోసిట్ గ్రీడర్స్ పూర్తిచేయడం జరిగింది.  73 స్లాబ్ ల నిర్మాణం కూడా పూర్తయ్యాయి. ఇప్పటి వరకు 93 శాతం  పూర్తికాగా వచ్చే డిసెంబర్ నాటికి పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తెనున్నారు. ఈ ప్రాజెక్టుతో గచ్చిబౌలి, మాదాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చుట్టూ ప్రధాన ఏరియాల గల ప్రాంత ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడే అవకాశం ఉంది.