షీల్డ్ కవర్ లో మేయర్‌, డిప్యూటీ మేయర్ పేర్లు...!

  ఈనెల 11న మేయర్‌ ఎన్నికలకు ఎక్స్‌అఫీషియో సభ్యులు కార్పొరేటర్లతో కలిసి జీహెచ్‌ఎంసీకి వెళ్లాలని సీఎం కేసీఆర్ సూచించారు. జీహెచ్‌ఎంపీ మేయర్‌ అభ్యర్థిని ఎన్నిక రోజే సీల్డ్‌ కవర్‌ ద్వారా తెలియజేస్తామని వెల్లడించారు. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ అభ్యర్థుల పేర్లు సీల్డ్‌ కవర్‌ ద్వారా కార్పొరేటర్లకు అందిస్తామని, కార్పొరేటర్లు జీహెచ్‌ఎంసీలోనే కవర్లు తెరచి పార్టీ బలపరిచిన అభ్యర్థికే ఓటు వేయాలని సీఎం కేసీఆర్‌ సూచించారు.