విలయానికి మానవ చర్యలే కారణమా..??

  ప్రకృతి ప్రకోపమా? మానవ విధ్వంసమా? ఉత్తరాఖండ్‌ను కుదిపేసిన జలవిలయానికి కారణమేంటి? ప్రస్తుతం శాస్త్రవేత్తలను తొలుస్తున్న ప్రశ్నలివే. భూతాపమే పెను శాపమై హిమనీనదం విరుచుకుపడిందని పలువురు నిపుణులు చెప్తున్నారు. పర్యావరణ పరంగా అత్యంత సున్నితమైన హిమాలయ ప్రాంతంలో మితిమీరిన మానవ చర్యలే విపత్తుకు దారితీశాయని మరికొందరు పేర్కొంటున్నారు. అభివృద్ధి పేరిట అక్కడ సాగిస్తున్న విధ్వంసకాండకు ముగింపు పలుకాలని స్పష్టంచేస్తున్నారు. ఆదివారంనాటి దుర్ఘటనలో మృతిచెందిన వారి సంఖ్య 18కి చేరింది. ఇంకా 202 మంది ఆచూకీ దొరకలేదని అధికారులు తెలిపారు. గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.