వారి ఆదాయం రోజుకు 2,200 కోట్లు

అంతర్జాతీయ  సంఘం  ఆక్స్‌ఫామ్‌ సంస్థ  విడుదల చేసిన నివేదికలోని కొన్ని వివరాలు

►భారత కుబేరుల సంపద గత ఏడాది రోజుకు రూ.2,200 కోట్లు చొప్పున పెరిగింది. ప్రపంచ కుబేరుల సంపద 12 శాతం లేదా రోజుకు 250 కోట్ల డాలర్ల మేర ఎగసింది. ప్రపంచంలోని పేదల సంపద మాత్రం 11 శాతం క్షీణించింది. 


►మన దేశంలోని అత్యంత ఐశ్వర్యవంతుల సంపద 39 శాతం వృద్ధి చెందగా, జనాభాలో సగ భాగం సంపద 3 శాతమే పెరిగింది. 


►భారత్‌లో అత్యంత పేదలైన 13.6 కోట్ల మంది(జనాభాలో పది శాతం) 2004 నుంచి అప్పుల ఊబిలో కూరుకుపోయే ఉన్నారు. 


►వృద్ధి చెందుతున్న భారత సంపదను కొందరు కుబేరులే అనుభవిస్తున్నారని, కానీ పేదలు ఒక పూట కూడా గడవని, పిల్లలకు మందులు కూడా కొనివ్వలేని దుర్భర పరిస్థితుల్లో ఉన్నా రు. ఇది ఇలాగే కొనసాగితే, భారత సామాజిక, ప్రజాస్వామ్య వ్యవస్థ కుప్పకూలుతుంది. 


►భారత జాతీయ సంపదలో 77.4%  10 శాతం అత్యంత ధనికుల చేతుల్లోనే ఉంది. 1% కుబేరుల చేతుల్లోనే 52% జాతీయ సంపద ఉంది. 


► జనాభాలోని 60 శాతం మంది చేతిలో కేవలం 4.8 శాతం సంపద మాత్రమే ఉంది.


► 9 మంది అత్యంత సంపన్నుల సంపద దేశ జ నాభాలోని సగం మంది సంపదతో సమానం. 


►  2022 నాటికి భారత్‌లో రోజుకు 70 మంది కొత్త కుబేరులు పుట్టుకొస్తారని అంచనా. 


►గత ఏడాది కొత్తగా 18 మంది బిలియనీర్లు అవతరించారు. దీంతో భారత్‌లోని బిలియనీర్ల సంఖ్య 119కు పెరిగింది. వీరందరి సంపద తొలిసారిగా గత ఏడాది 40,000 కోట్ల డాలర్లు(రూ.28 లక్షల కోట్లు)కు పెరిగింది.


►2017లో 32,550 కోట్లుగా ఉన్న బిలియనీర్ల సంపద గత ఏడాది 44,010 కోట్ల డాలర్లకు పెరిగింది. 2008 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం తర్వాత బిలియనీర్ల సంపద ఒక్క ఏడాది ఈ స్థాయిలో పెరగడం ఇదే మొదటిసారి. 


►భారత కేంద్ర ప్రభుత్వం, భారత్‌లోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు వైద్య, ప్రజారోగ్యం, పారి శుధ్యం, నీటి సరఫరాల కోసం రూ.2,08,166 కోట్లు ఖర్చు చేస్తున్నాయి. ఇది భారత అత్యంత ధనవంతుడు ముకేశ్‌ అంబానీ సంపద (రూ.2.8 లక్షల కోట్లు) కంటే కూడా తక్కువే.