వాటర్ మెలోన్ ఫేస్ ప్యాక్

పుచ్చకాయ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. వేసవి కాలానికి ఊరటగా ఉండే పుచ్చకాయ నీటి శాతంలో అధికంగా ఉంటుంది. తియ్యగా ఉండడమే కాకుండా, మానసికంగా ఉత్తేజాన్ని కలిగిస్తుంది. అంతేకాకుండా, శరీరంలో నీటి స్థాయిలను పెంచడంతో పాటు, డీహైడ్రేషన్ సమస్యలకు చెక్ పెట్టేందుకు దోహదపడుతుంది. దీనిలో ఉండే పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. క్రమంగా పుచ్చకాయ లేని వేసవిని ఊహించుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. కానీ, కేవలం ఈ పుచ్చకాయ ఆరోగ్యానికి మాత్రమే కాకుండా, మీ చర్మానికి మరియు జుట్టుకు కూడా ఎంతో మేలు చేకూరుస్తుందని చెప్పబడింది.
చర్మ సంరక్షణ కొరకు సిఫారసు చేయబడిన పండ్లలో పుచ్చకాయకు ఎందుకంత ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది?


పుచ్చకాయలో అత్యంత ముఖ్యమైన విటమిన్లు మరియు పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా లైకోఫేన్ అనే ప్రత్యేకమైన పదార్ధం, మీ చర్మం నుంచి ఫ్రీ రాడికల్స్ తొలగించడంలో సాయపడుతుంది, తద్వారా చర్మం పాడవకుండా కాపాడగలుగుతుంది. మీరు పుచ్చకాయను రోజువారీగా ఆహార ప్రణాళికలో జోడించుకోవచ్చు, క్రమంగా దీని యొక్క అద్భుతమైన ప్రయోజనాలను శరీరానికి అందించవచ్చు. లేదా ఫేస్ మాస్క్, క్లెన్సర్స్, హెయిర్ మాస్క్లు లేదా కండిషనర్ల రూపంలో మీ చర్మం మరియు జుట్టు సంరక్షణా చర్యలలో భాగంగా కూడా దీనిని చేర్చవచ్చు. అయితే, మనం ఈ రెసిపీని ప్రారంభించడానికి ముందుగా, మీ స్కిన్ కేర్ విషయంలో పుచ్చకాయ ఏవిధంగా సహాయం చేస్తుందో తెలుసుకోడానికిగల ముఖ్యమైన కారణాల జాబితాను తెలుసుకుందాం.
చర్మానికి పుచ్చకాయ వలన కలిగే ప్రయోజనాలు :
విటమిన్ A, B6, మరియు C తో లోడ్ చేయబడిన పుచ్చకాయ నిజంగా ఒక దివ్య ఫలమనే చెప్పవచ్చు. అంతేకాకుండా ఇది చర్మ సంరక్షణలో కూడా అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది.
• ఇది మీకు ప్రకాశమైన చర్మాన్ని ఇస్తుంది.
• ఇది మీ చర్మాన్ని పోషకమయం చేస్తుంది.
• ఇది మీ చర్మాన్ని తేమగా మరియు హైడ్రేట్ చేస్తుంది.
• ఇది ఒక నేచురల్ స్కిన్ టోనర్ గా మరియు క్లెన్సర్ వలె పనిచేస్తుంది.
• ఇది యాంటీ ఏజింగ్ ఏజెంట్ వలె పనిచేస్తుంది.
• ఇది మీ చర్మంలో అదనపు నూనెల ఉత్పత్తిని నిరోధిస్తుంది.
• ఇది మీ పొడి చర్మానికి ఉత్తమమైన ట్రీట్మెంట్.
• ఇది టాన్ తొలగిస్తుంది.
• ఇది మీకు ముడుతలు లేని చర్మాన్ని అందిస్తుంది మరియు చారలను తొలగిస్తుంది.
• ఇది మొటిమలను, ఆక్నే సమస్యను కూడా నివారిస్తుంది.

 

పుచ్చకాయతో ఫేస్-మాస్క్ లను తయారు చేసే విధానం :
1. పుచ్చకాయ - తేనె :
యాంటీ బ్యాక్టీరియల్ (క్రిమినాశక తత్వాలు) మరియు యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉన్న తేనె బాక్టీరియాను నిర్మూలించడమే కాకుండా, చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసి, చర్మ పోషణకు తోడ్పడుతుంది.
కావలసిన పదార్ధాలు : 
• 2 టేబుల్ స్పూన్ల పుచ్చకాయ రసం
• 2 టేబుల్ స్పూన్ల తేనె
ఉపయోగించు విధానం : 
• పుచ్చకాయ రసం మరియు తేనెను ఒక గిన్నెలోకి తీసుకుని, ఒక స్థిరమైన మిశ్రమం వచ్చేలా కలుపుకోవాలి.
• దీనిని మీ ముఖం మరియు మెడపై నలుదిక్కులా విస్తరించునట్లు అప్లై చేయండి • •
• మరియు సుమారు 20 నిమిషాలపాటు దానిని అలాగే విడిచిపెట్టండి.
• తర్వాత దీనిని చల్లటి నీటితో శుభ్రంచేయండి మరియు మీ ముఖాన్ని పొడి తువాలుతో శుభ్రంగా తుడవండి.
• ఉత్తమ ఫలితాల కోసం కనీసం వారానికొకసారి అనుసరించండి.

 
2. పుచ్చకాయ - యోగర్ట్ :
పెరుగు మీ చర్మం నుండి అదనపు నూనెను తొలగించడానికి సహాయపడుతుంది. అలాగే హానికరమైన అతినీల లోహిత సూర్య కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది మరియు టానింగ్ తగ్గిస్తుంది.
కావలసిన పదార్ధాలు : 
• 2 టేబుల్ స్పూన్ల పుచ్చకాయ గుజ్జు
• 2 టేబుల్ స్పూన్ల యోగర్ట్ లేదా పెరుగు.
ఉపయోగించు విధానం : 
• పుచ్చకాయ గుజ్జు మరియు పెరుగు లేదా యోగర్ట్ ను ఒక గిన్నెలో మిశ్రమంగా కలపండి.
• దీనిని మీ ముఖం మరియు మెడపై అప్లై చేయండి.
• సుమారు 10-15 నిమిషాలపాటు ముఖంపై ఆరనివ్వండి.
• దానిని చల్లటి నీటితో శుభ్రం చేయండి తరువాత, పొడి తువాలుతో ముఖంపై నీటిని తొలగించండి.
• ఉత్తమ ఫలితాల కొరకు వారానికి రెండు సార్లు దీనిని పునరావృతం చేయండి.

 
3. పుచ్చకాయ - మిల్క్ :
పాలలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది, ఇది మీ చర్మం యొక్క స్థితిస్థాపక శక్తిని మెరుగుపరుస్తుంది. అంతేగాక, పాలు మీ చర్మ నిగారింపును మెరుగుపరచడానికి కూడా సహాయపడుతాయి.
కావలసిన పదార్ధాలు : 
• 2 టేబుల్ స్పూన్ల పుచ్చకాయ రసం
• 2 టేబుల్ స్పూన్ల పాలు
• 1 విటమిన్ E టాబ్లెట్
ఉపయోగించు విధానం : 
• ఒక గిన్నెలోకి కొంత పుచ్చకాయ రసాన్ని తీసుకోండి. తరువాత, దానికి కొన్ని పాలను జోడించండి.
• విటమిన్ E టాబ్లెట్ కట్ చేసి, ఆ మిశ్రమానికి జోడించండి. అన్ని పదార్ధాలను మిశ్రమంగా కలపండి.
• దీనిని మీ ముఖం మరియు మెడపై అప్లై చేయండి.
• సుమారు 20 నిమిషాలపాటు దానిని విడిచిపెట్టండి.
• దానిని చల్లని నీటితో శుభ్రం చేయండి మరియు పొడి తువాలుతో ముఖం మీది నీటిని తొలగించండి.
• ఆశించిన ఫలితాల కొరకు వారంలో రెండు సార్లు దీనిని పునరావృతం చేయండి.

 
4. పుచ్చకాయ - దోసకాయ :
ప్రముఖ యాస్ట్రింజెంట్ అయిన కీరా దోసకాయ మొటిమల మచ్చలు తేలికపడటానికి సహాయపడతాయి. అలాగే చర్మం నుండి మృత చర్మ కణాలను మరియు మలినాలను తొలగిస్తుంది.
కావలసిన పదార్ధాలు : 
• 1 టేబుల్ స్పూన్ పుచ్చకాయ రసం
• 1 టేబుల్ స్పూన్ దోసకాయ గుజ్జు
ఉపయోగించు విధానం : 
• ఒక గిన్నెలో కొంత పుచ్చకాయ రసాన్ని మరియు దోసకాయ గుజ్జును తీసుకుని మిశ్రమంగా చేయాలి. మీరు ఒక స్థిరమైన పేస్ట్ పొందేవరకు రెండు పదార్ధాలను కలుపుకోవాలి.
• దీనిని మీ ముఖం మరియు మెడపై అప్లై చేయండి.
• సుమారు 10-15 నిమిషాలపాటు ముఖంపై ఆరనివ్వండి..
• ఆతర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయండి మరియు పొడి తువాలుతో ముఖాన్ని తుడవండి.
• ఆశించిన ఫలితాల కొరకు కనీసం వారంలో రెండుమార్లు దీనిని పునరావృతం చేయండి.

 
5. పుచ్చకాయ - అరటి పండు:
అరటిపండు విటమిన్ ఎ, B6 మరియు c లతో లోడ్ చేయబడి ఉంటుంది. అరటిపండు చర్మ సంరక్షణకు ఎంతగానో దోహదపడుతుంది. ఫ్రీ రాడికల్స్ వలన కలిగే నష్టాన్ని తగ్గించడంలో సహాయపడే యాంటీఆక్సిడెంట్లు కలిగి ఉంటాయి.
కావలసిన పదార్ధాలు : 
• 2 టేబుల్ స్పూన్ల పుచ్చకాయ గుజ్జు
• 2 టేబుల్ స్పూన్ల అరటి పండు గుజ్జు
ఉపయోగించు విధానం : 
• ఒక గిన్నెలో పుచ్చకాయ, అరటి పండు గుజ్జు రెండింటిని మిశ్రమంగా కలుపుకోవాలి.
• వీలయితే రెండు పదార్థాలను బ్లెండ్ చేయండి.
• దీనిని మీ ముఖం మరియు మెడపై నలువైపులా విస్తరించునట్లు అప్లై చేయండి మరియు దానిని 15 నిమిషాలపాటు అలాగే విడిచిపెట్టండి.
• కాసేపటి తర్వాత చల్లని నీటితో శుభ్రం చేయండి మరియు పొడి తువాలుతో మీ ముఖం మీది నీటిని తొలగించండి.
• ఉత్తమ ఫలితాల కోసం కనీసం వారంలో ఒకసారి అనుసరించండి.

 
6. పుచ్చకాయ - చక్కెర :
చక్కెర సహజ సిద్దంగానే అధిక తేమను క్రమబద్దీకరించే లక్షణాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా పర్యావరణంలోని తేమను చర్మంలోకి ఆకర్షిస్తుంది. మీ కిష్టమైన షుగర్ స్క్రబ్ కోసం పుచ్చకాయతో కలిపి అనుసరించవచ్చు.
కావలసిన పదార్ధాలు : 
• 2 టేబుల్ స్పూన్ల పంచదార
• 2 టేబుల్ స్పూన్ల పుచ్చకాయ గుజ్జు
ఉపయోగించు విధానం : 
• ఒక గిన్నెలో పుచ్చకాయ గుజ్జు, పంచదార రెండింటినీ కలుపుకోవాలి.
• ఈ మిశ్రమాన్ని మీ చేతులకు కొంత మోతాదులో తీసుకొని మీ ముఖాన్ని దానితో రుద్దండి.
• సుమారు 10 నిమిషాలపాటు అలాగే సున్నితంగా రుద్దండి మరియు మరో 5-7 నిమిషాలపాటు దానిని అలాగే విడిచిపెట్టండి.
• ఇప్పుడు చల్లటి నీటితో శుభ్రం చేయండి మరియు మీ ముఖాన్ని పొడి తువాలుతో తుడవండి.
• ఉత్తమ ఫలితాల కోసం వారంలో కనీసం ఒకసారి అనుసరించండి.

 
7. పుచ్చకాయ - బొప్పాయి :
బొప్పాయి పపైన్ అనే ఎంజైమ్ కలిగి ఉండి, ఎక్స్ఫోలియేటింగ్ లక్షణాలను ప్రదర్శిస్తుంది. అంతేకాకుండా మృతకణాలను విజయవంతంగా తొలగిస్తుంది.
కావలసిన పదార్ధాలు : 
• 2 టేబుల్ స్పూన్ల పుచ్చకాయ గుజ్జు
• 2 టేబుల్ స్పూన్ల బొప్పాయి గుజ్జు
ఉపయోగించు విధానం : 
• ఒక బొప్పాయి ముక్కను తీసుకుని, మాష్ చేసి గుజ్జుగా తీసుకుని దానిని ఒక గిన్నెలోకి కలపండి.
• దీనికి కొంత పుచ్చకాయ గుజ్జును జోడించి, రెండింటిని కలిపి మిశ్రమంగా చేయాలి.
• దీనిని మీ ముఖం మరియు మెడపై నలుదిక్కులా విస్తరించునట్లు అప్లై చేయండి మరియు దానిని 15 నిమిషాలపాటు అలాగే విడిచిపెట్టండి.
• దానిని చల్లటి నీటితో శుభ్రం చేయండి., మరియు పొడి తువాలుతో ముఖంపై నీటిని తొలగించండి.
• ఉత్తమ ఫలితాల కోసం వారంలో కనీసం ఒకసారి అనుసరించండి.

 
8. పుచ్చకాయ - అవకాడో :
ఫ్రీ రాడికల్స్ తో పోరాడే యాంటీ ఆక్సిడెంట్స్ మరియు బీటా కెరోటిన్ అధికంగా ఉండే అవకాడో, మీ చర్మానికి ఎటువంటి నష్టం జరగకుండా కాపాడుతాయి. అంతేకాకుండా ఇవి యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉంటాయి. చర్మానికి యవ్వన సౌందర్యాన్ని, నిగారింపును ఇస్తాయి.
కావలసిన పదార్ధాలు : 
• 2 టేబుల్ స్పూన్ల పుచ్చకాయ గుజ్జు
• 2 టేబుల్ స్పూన్ల అవకాడో గుజ్జు
ఉపయోగించు విధానం : 
• కొంత పుచ్చకాయ మరియు అవకాడో గుజ్జును ఒక గిన్నెలోనికి తీసుకుని మిశ్రమంగా కలపండి.
• మృదువైన పేస్ట్ వచ్చేంత వరకు రెండు పదార్థాలను సున్నితంగా కలపండి.
• దీనిని మీ ముఖంపై అప్లై చేయండి.
• సుమారు 20 నిమిషాలపాటు అలాగే విడిచిపెట్టండి.
• కాసేపటి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయండి మరియు మీ ముఖాన్ని పొడి తువాలుతో తుడవండి.
• ఉత్తమ ఫలితాల కోసం వారానికి కనీసం ఒకసారి అనుసరించండి.

 
9. పుచ్చకాయ - కలబంద గుజ్జు :
కలబంద గుజ్జు చర్మాన్ని పునరుత్తేజితం గావిస్తుంది. అంతేకాకుండా చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. మీ చర్మాన్ని ఎప్పటికప్పుడు తాజాగా ఉంచేలా చేస్తుంది, మరియు క్రిమినాశక గుణాలను సైతం కలిగి ఉంటుంది. క్రమంగా ఇది మొటిమలను మరియు ఆక్నే సమస్యకు చికిత్సగా ఉపయోగపడగలదు.
కావలసిన పదార్ధాలు : 
• 2 టేబుల్ స్పూన్ల పుచ్చకాయ గుజ్జు
• 2 టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్
• 2 టేబుల్ స్పూన్ల తాజా కలబంద గుజ్జు
ఉపయోగించు విధానం : 
• ఒక బౌల్ తీసుకొని అందులో పుచ్చకాయ గుజ్జును కలపండి.
• తరువాత, కొంత రోజ్ వాటర్ జోడించండి, మళ్లీ బాగా కలపండి.
• మీరు రోజ్ వాటర్ జోడించిన తర్వాత, తాజాగా సంగ్రహించిన కలబంద గుజ్జును తీసుకొని పుచ్చకాయ మిశ్రమంతో మిక్స్ చేయాలి.
• ఈ పేస్ట్ ను మీ ముఖం మరియు మెడ మీద అప్లై చేసి సుమారు అరగంట పాటు ఆరనివ్వాలి.
• 30 నిమిషాల తరువాత, దానిని శుభ్రంచేసి, మీ ముఖాన్ని పొడి తువాలుతో తుడవండి.
• ఉత్తమ ఫలితాల కొరకు వారానికి ఒకటి లేదా రెండుసార్లు దీనిని పునరావృతం చేయండి.

 
10. పుచ్చకాయ - దానిమ్మ :
దానిమ్మలో అధికంగా విటమిన్ సి ఉంటుంది. క్రమంగా ఇది, పొడిబారడాన్ని తగ్గించి మీ చర్మాన్ని మృదువుగా మరియు నునుపుగా ఉండేలా చేస్తుంది. అంతేకాకుండా మీ చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది మరియు చర్మానికి పోషకాలను అందిస్తుంది. దానిమ్మ గింజలు చెడిపోయిన చర్మాన్ని బాగుచేయడంలో కూడా సహాయపడతాయి.
కావలసిన పదార్ధాలు : 
• 2 టేబుల్ స్పూన్ల పుచ్చకాయ రసం
• 2 టేబుల్ స్పూన్ల దానిమ్మ రసం
• 1 టేబుల్ స్పూన్ తేనె
ఉపయోగించు విధానం : 
• ఒక గిన్నెలో పుచ్చకాయ, దానిమ్మ రసం రెండింటినీ కలుపుకోవాలి.
• దీనికి కొంత తేనెను జోడించండి, మరలా అన్ని పదార్థాలను కలిపి మిశ్రమంగా చేసుకోండి.
• ఈ మిశ్రమాన్ని మీ ముఖం మరియు మెడ మీద నలుదిక్కులా విస్తరించునట్లు అప్లై చేసి ఆరనివ్వాలి.
• సుమారు అరగంట పాటు వేచి ఉండి, తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
• ఉత్తమ ఫలితాల కొరకు వారానికి ఒక్కసారి ఈ ప్రక్రియను పునరావృతం చేయండి.
గమనిక : ఇందులో మీకు నచ్చిన ఫేస్ పాక్స్ ఎంచుకుని, ఒకటో రెండో అనుసరిస్తే చాలు.
ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర మేకప్, ఫాషన్, ఆరోగ్య, జీవనశైలి, ఆహార, మాతృ శిశు సంబంధ, వ్యాయామ, లైంగిక, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి