వరద సహాయంపై లేని స్పష్టత .

వరద సహాయంపై లేని స్పష్టత..

గడపదాటని బల్దియా అధికారులు..

మార్గదర్శకాలు లేవంటున్న క్షేత్రస్థాయి అధికారులు..

సహాయం కోసం ఎదురుచూస్తున్న వరద భాదితులు..

 

                హైదరాబాద్ లో వరద సహాయం పై స్పష్టత రావడం లేదు. ఏడవ తేదినా పెద్ద సంఖ్యలో ప్రజలు మీసేవాల వద్ద భారులు తీరడంతో ఇంటివద్దకు వచ్చి నష్టపరిహారం అంచనా వేసి సహాయం అందజేస్తామని బల్దియా కమీషనర్ ప్రకటించారు. ఇప్పటి వరకు ఉన్నతాదికారుల నుండి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో క్షేత్రస్థాయిలో పరిశీల కార్యక్రమం ఇంకా స్టార్ట్ కాలేదు. లబ్దిదారుల ఎంపికపై కూగా ప్రభుత్వం మార్గదర్శాలు విడుదల చేయ్యలేదంటున్నాయి బల్దియా వర్గాలు. 

 

                 గత నెలలో వచ్చిన వరదల్లో నష్టపోయిన వారిని అదుకునేందుకు వదర సహాయం పంపిణి కార్యక్రమాన్ని ప్రారంభించింది ప్రభుత్వం. గ్రేటర్ పరిధిలో ఉన్న అనేక ప్రాంతాల్లో ముంపు సమస్య ఉత్పన్నం కావడం సిటిజన్స్ తీవ్ర ఇబ్బందులకు..,  నష్టాలకు గురైన నేపథ్యంలో వారికి ప్రతి కుటుంబానికి 10వేల  ఆర్థిక సహాయం అందజేయ్యాలని నిర్ణయించింది ప్రభుత్వం. బల్దియా అధికారులు సిబ్బంది క్షేత్రస్థాయిలో తిరిగి వరద కారణం నష్టపోయిన వారికి ప్రతి కుటుంబానికి 10వేల సహాయాన్ని అందజేశారు. ఇంత వరకు భాగానే ఉంది. ఎన్నికల ప్రారంభం కావడంతో ఈ సేవాల్లో ధరకాస్తూ చేసుకోవాలని సూచించడంతో పెద్ద సంఖ్యలో వదర భాదితులు   మీసేవాల్లో దరకాస్తులు చేసుకున్నారు. అలాంటి వారి వెంటనే వరదసహాయం బ్యాంకు అకౌంట్లలో పడటంతో భాదితులందరూ మీసేవా సెంటర్లకు క్యూ కట్టారు. పెద్ద ఎత్తున రద్దీ పెరగడం..., తరువాత ఎన్నికల కోడ్ నేపథ్యంలో సహాయం పంపిణి నిలిపివేయ్యాలని స్టేట్ ఎలక్షన్ కమీషన్ ఉత్తర్వులు ఇవ్వడంతో వదర సహాయం నిలిచిపొయింది. 

                  ఎన్నికల కోడ్  పూర్తి అయిన తరువాత వరద సహాయం కోసం దరకాస్తూ చేసుకోవాలని అందరికి వరద సహాయం చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడంతో 7వ తేది ఉదయం నుండి మీసేవా కేంద్రాల్లో భారులు తీరారు వరద భాదితులు. పెద్ద సంఖ్యలో వచ్చిన భాదితులను చూసి..., ఇళ్ల వద్దకు వచ్చి పరిశీలించి వరద సహాయం అందజేస్తామంటూ బల్దియా కమీషనర్ పేరుతో ప్రకటన రావడమే కాకుండా మీసేవా కేంద్రాలను కూడా క్లోజ్ చేశారు. దాంతో నిరాశతో ఇళ్లకు తిరిగి వెళ్లారు భాదితులు. అయితే ఇప్పటి వరకు బల్దియా అధికారులు భాదితుల గుర్తింపు కార్యక్రమం ప్రారంభం కాలేదు. ఉన్నతాదికారుల నుండి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని..., అందుకు సంబందించిన మార్గదర్శకాలు కూడా లేవంటున్నాయి బల్దియా వర్గాలు.  ఇప్పటి వరకు వచ్చిన మీసేవ ధరకాస్తులను రాస్ట్ర ప్రభుత్వం పరిశీలించి నేరుగా లబ్దిదారుల అకౌంటుకు ఆర్థిక విభాగం నుండి సహాయం మంజూరు చేశాయంటున్నాయి బల్దియా వర్గాలు. క్షేత్రస్థాయి పరిశీలనలో 4.3లక్షల కుంటుంబాలకు 430కోట్లు అందించగా..., మీసేవాల్లో దరకాస్తు చేసుకున్న 2లక్షల మంది వరకు సహాయం అందినట్లు తెలుస్తుంది. ఇక గ్రేటర్లో సుమారుగా 250కాలనీలు బస్తిల్లో వరద వచ్చినట్లు చెబుతున్నారు అధికారులు. అందులో కూడా కోన్ని ఇళ్లు నీటమునగ లేదంటున్నారు. 

              ఇప్పటి వరకు లబ్ది పోందిన వారు మరోసారి సహాయం తీసుకోకుండా ఉండేలా ఇప్పటి వరకు ఎవ్వరేవ్వరికి లబ్దిజరిగిందన్న అంశాలను ఆధార్ కార్డు నెంబర్లతో చెక్ చేసే అవకాశం ఉందంటున్నారు అధికారులు. అవసరమైతే సమగ్ర కుంటుంబ సర్వే డేటాతో పోల్చి చూసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నాయి బల్దియా వర్గాలు.   ఇక మీసేవా కేంద్రాల్లో దరకాస్తులు అవసరం లేదని లబ్దిదారుల ఇల్లకు వచ్చి సర్వే చేసి సహాయం అందిస్తామని కమీషనర్ చేసిన ప్రకటన ఇప్పుడు చర్చనీయ అంశం అయ్యింది. ఎలాంటి మార్గదర్శాలు లేకుండా...,  ఇంటికి వచ్చి పరిశీలన ఎలా చేస్తారు.., ఎలా సహాయం అందిస్తామనే అంశంలో చేసిన ప్రకటనపై స్పష్టత ఇవ్వడం లేదు జిహెచ్ఎంసి అధికారులు.