వంటింట్లో.. రోగనిరోధక శక్తి..

వంటిల్లే వైద్యశాల .. అంటుంది ఆయుర్వేదం. అది ఎంత నిజమో తెలియదు కానీ, మనకు తెలిసిన బాషలోనే ఆలోచిద్దాం. రోజు వాడుకునే నిమ్మకాయ, అల్లం, తేనే; ఈ మూడు ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యంగా ఉన్నట్టే అంటున్నారు వైద్య నిపుణులు. ఈ మూడు రోజు తీసుకుంటే శరీరానికి కావాల్సిన రోగనిరోధక శక్తి అందుతుంది. తద్వారా చాలా అనారోగ్యాల నుండి దూరంగా ఉండవచ్చు.

శరీరంలో రోగనిరోధక శక్తి తగినంతగా లేనందువల్లనే అనారోగ్యం తలెత్తుతుంది. లేదంటే అది మన దరిదాపులలోకి కూడా రాదు. అందుకే ఈ మూడింటిని కలిపి టానిక్ తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని గాజు సీసాలో పోసి ఫ్రిజ్‌లో భద్రపరిస్తే నెలల తరబడి పాడవకుండా ఉంటుంది. దానిని రోజు తీసుకుంటూ ఆరోగ్యంగా ఉందాం. దీన్ని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

* రెండు పెద్ద నిమ్మకాయలను మధ్యకు తరగాలి.

* అల్లాన్ని చూపుడు వేలంత పొడవుగా ఉండే బద్దలుగా తరుక్కోవాలి.

* ఈ ముక్కలు మునిగేంత వరకూ వాటిపై తేనెను పోయాలి.

* తేనెతో సీసా నిండాక మూత బిగించి ఫ్రిజ్‌లో భద్రపరుచుకోవాలి.

* అవసరమైనప్పుడు నేరుగా స్పూన్‌తో తినొచ్చు. లేదా వేడి నీళ్లలో స్పూన్ మిశ్రమాన్ని కలుపుకుని తీసుకోవచ్చు.