లాక్ డౌన్ ఉండదన్న మంత్రి ఈటల....

     తెలంగాణలో లాక్‌డౌన్ పెట్టే ఆలోచన లేదని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ మరోసారి తెలిపారు. ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటకలో లాగా తెలంగాణలో సీరియస్ పరిస్థితి లేదన్నారు. కొంతమంది కరోనా పేషెంట్స్ తెలిసి తెలియక హాస్పిటల్స్ నుంచి పారిపోతున్నారన్న ఈటల.. ఒకరిద్దరు పోయినంత మాత్రాన వైద్యం అందలేదన్న అపవాదు వేయడం సరైనది కాదని వ్యాఖ్యానించారు.

   నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్‌డౌన్‌పై 48 గంటల్లోగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు డెడ్‌లైన్ విధించింది. ఈ క్రమంలో హైకోర్టు ఆదేశాలపై ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే తాము నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు హెచ్చరించడంతో.. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.