రోడ్డు విస్తరణ - ట్రాఫిక్ సమస్యకు చెక్

 

                బాగ్అంబర్ పేట డివిజన్ డి.డి కాలనీ రోడ్డును వెడల్పు చేసేందుకు కృషి చేస్తామని మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి అన్నారు. శివం రోడ్డు నుండి డి.డి కాలనీ రోడ్డు వెడల్పు ప్రతిపాదన  స్థలాన్ని మేయర్ పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వ స్కిల్ డెవలప్మెంట్ సంస్థకు సంబందించిన ప్రహరీ గోడ తొలగించాల్సి ఉన్నందున అట్టి స్థలం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నేపథ్యంలో స్థలానికి సంబందించిన పూర్తి వివరాలు  అందజేయాలని అంబర్ పేట్ తహశీల్దార్ ను మేయర్ ఆదేశించారు.

               డి.డి కాలనీ సాయి బాబా గుడికి భక్తులు చాలా మంది వస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యతో పాటు  6వ నంబర్ రోడ్డు మరమ్మత్తులు చేస్తున్నందున వాహనదారులు రామంతపూర్, ఉప్పల్ కు అక్కడ నుండి ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు   కూడా ప్రత్యామ్నాయ మార్గం గా  భావించడం మూలంగా ట్రాఫిక్ సమస్య వస్తున్నట్లు కార్పొరేటర్ పద్మ వెంకటరెడ్డి  మేయర్ కు వివరించారు. శివం రోడ్డు నుండి సాయి బాబా టెంపుల్ మీదుగా పార్కు వరకు  40 ఫీట్ల రోడ్డు ఉందని దాన్ని  60 ఫీట్ల   రోడ్డు వెడల్పు చేయాలని కార్పొరేటర్ మేయర్ ను కోరారు.


             రోడ్డు వెడల్పు కు సంబంధించిన పూర్తి వివరాలు పరిశీలన చేసి నివేదిక అందజేయాలని చీఫ్ టౌన్ ప్లానింగ్ అధికారి దేవేందర్ రెడ్డిని  మేయర్ కోరారు.   మొత్తం ప్రక్రియ 15 రోజుల్లో పూర్తి  చేయాలన్నారు.  రోడ్డు వెడల్పు కు కృషి చేస్తామని మేయర్ అన్నారు.