రెమిడెసివిర్ తెప్పిస్తా.. కిషన్ రెడ్డి

   సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి శనివారం సందర్శించారు. ఆస్పత్రిలో బెడ్లు, ఆక్సిజన్ కొరత, ట్రీట్‌మెంట్ వివరాలు, మరణాలపై కిషన్ రెడ్డి ఆరా తీశారు. కేంద్రం నుంచి అందించాల్సిన సాయంపై గాంధీ ఆస్పత్రి సూపరింటెండ్‌తో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కేంద్రంతో మాట్లాడి రెమిడెసివిర్ తెప్పిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గాంధీ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరతలేదని స్పష్టం చేశారు.