మెట్రోకు పెరుగుతున్న రద్దీ

                   కరోనా తర్వాత హైదరాబాద్ మెట్రో రైల్ కు రోజు రోజు కు రద్దీ పెరుగుతుంది. సిటీ  ప్రజా రవాణాలో వేగంగా ప్రయాణికులను పెంచుకున్న  హైదరాబాద్ మెట్రో  కరోనాతో ఒక్కసారిగా ప్రయాణికులను కోల్పోయింది. కొన్నాళ్లుగా సాధారణ పరిస్థితులు నెలకొనడంతో మెట్రోకు రద్దీ పెరుగుతుంది. ఇటివల తమ సేవల సమయాన్ని మరో గంటపాటు పెంచారు హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు.   వివిధ ఆఫర్లు ప్రకటించడం కూడా ప్రయాణికుల సంఖ్య పెరుగుదలకు కారణం అవుతుంది.  వర్షాలకు సిటి లో రోడ్లపై ట్రాఫిక్ ఇబ్బందులు  ఎక్కువ ఉండటం కూడా మెట్రోకు ప్రయాణికులను పెంచుతుంది.

                 హైదరాబాద్ మెట్రో రైల్ తగ్గి పోయిన తన ప్రయాణికులను రాబట్టుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటుంది. కోవిడ్ రూల్స్ పాటిస్తూ ప్రయాణికులకు సేవలందిస్తున్న మెట్రో రద్దీ పెంచడమే లక్ష్యంగా ముందుకు వెళ్తుంది. అందులో బాగంగా మెట్రో పలు అఫర్లు ప్రకటించింది.  ఏడాది ఉగాది నుండి ప్రయాణికుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా సూపర్ సేవర్ ఆఫర్ ప్రకటించింది ఎల్ అండ్ టి మెట్రో .   వచ్చే ఏడాది మార్చి వరకు ఉన్న 100 సెలవు  దినాల్లో  ఈ ఆఫర్ ఉపయోగించుకోవచ్చు. మొదటి సారి 50 రూపాయలతో మెట్రో కార్డు కొనుగోలు చేసి..., 59 రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే సిటీలోని మూడు కారిడార్లలో ఎక్కడి నుండి ఎక్కడికైనా అన్ లిమిటెడ్ గా ప్రయాణం చేయవచ్చు. తాజాగా ఎంజీబీఎస్ నుండి జె బి ఎస్ వరకు ఎక్కడి నుండి ఎక్కడికి ప్రయాణం చేసినా కేవలం 15 రూపాయల టికెట్ ధరను నిర్ణయించారు. ఇలా మెట్రో తన ప్రయాణికులను పెంచుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుంది.  గత ఏడాది నవంబర్ లో 2.30లక్షల మంది ప్రయాణికులు ఉండగా.. ఈ ఏడాది ఏప్రిల్ మొదటి వారానికి   ప్రతి రోజు 2.8లక్షల మంది  వరకు మెట్రోలో ప్రయాణం చేశారు.  గడిచిన కోన్ని వారాలుగా మెట్రోలో ఫిక్ అవర్స్ లో రద్దీ భారీగా పెరింగి.  కొంతమంది ఐటీ ఉద్యోగులు.... ఇతర ఉద్యోగులు మెట్రోను ఎక్కువ ఆశ్రయిస్తున్నారు. పాఠశాల ఓపెన్ కావడం కూడా రద్దీ పెరుగుదలకు కారణం అయ్యింది. ఏప్రిల్ మొదటి నుండి హైదరాబాద్ మెట్రో రైళ్ల వేగం గంటకు 70 నుండి 80 కిలో మీటర్లకు పెంచేందుకు కమీషనర్ ఫర్ మెట్రో రైల్ సేఫ్టి అనుమతులు ఇచ్చింది. దాంతో కారిడార్ 1 మియాపూర్ నుండి ఎల్బీనగర్ వరకు 4నిమిషాల టైం తగ్గగా..., కారిడార్ 2లో ఎంజీబీఎస్ నుండి జె బి ఎస్ వరకు 1.15నిముషాలటైం సేవ్ అవుతుంది. ఇక కారిడార్ 3 నాగోల్ నుండి రాయదుర్గం వరకు 6 నిముషాల ప్రయాణ సమయం తగ్గింది.  ఇది కూడా మెట్రో ప్రయాణికుల వేగం పేరగడానికి రద్దీ పెరగడానికి కూడా అవకాశం కల్పించింది.

                 పరిస్థితులు సాధన స్థితికి రావడంతో మెట్రో ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. గడిచిన రెండు మూడు నెలలుగా మెట్రో ను ఆశ్రయించి వారి సంఖ్య మరింత ఎక్కువగా ఉంది అంటున్నాయి మెట్రో వర్గాలు.  వారం 15 రోజుల కింద కరోనా తర్వాత 4 లక్షల మార్కును టచ్ చేసింది హైదరాబాద్ మెట్రో. కొన్నాళ్లుగా ప్రయాణికుల సంఖ్య 3 లక్షల 90 వేలుగా ఉంది అంటున్నాయి మెట్రో వర్గాలు. కరోనా కంటే ముందు నాలుగు లక్షల 50 వేల మార్కును క్రాస్ చేసిన మెట్రో ఇప్పుడు దానిని సాధించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. ఈ నెల పదో తేదీ నుండి చివరి ట్రైన్ సమయాన్ని రాత్రి  11 గంటల వరకు పొడిగించారు. దాంతో సెకండ్ షిఫ్ట్ పూర్తి చేసుకున్న ఉద్యోగులు.., వివిధ పనుల పై ఆలస్యం అయిన వారు.., ఫంక్షన్లుకు వెళ్లిన వారు సైతం మెట్రోను ఆశ్రయిస్తారు. ప్రయాణికులు మెల్లమెల్లగా పెరుగుతుండడం పట్ల ఎల్ అండ్ టి అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక సిటిలో ఇంకా 5.5 కిలోమీటర్ల మేర ఓల్డ్ సిటీ లో రైల్వే ట్రాక్ నిర్మాణం పనులు పూర్తి కాలేదు. బడ్జెట్ లో 500 కోట్ల రూపాయలు కేటాయించారని ఆ పనులను వేగంగా పూర్తి చేయాలని మెట్రో రైల్ ఎండి ని కలిశారు  ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ. ఇక్కడ కూడా మెట్రో పూర్తి అయితే రద్దీ భారీగా పెరిగే అవకాశం ఉంది. అయితే కొన్ని సందర్భాల్లో మెట్రోలో వస్తున్న సాంకేతిక సమస్యలు ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. వాటిపై ఫోకస్ చేసి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటే మెట్రోకు ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.