ముసారాం బ్రడ్జ్ పనులు ఎప్పుడు

                              సిటిలో సమస్యలు వచ్చినప్పుడు ప్రజా ప్రతినిదులు.. అధికారులు.. అందరూ హాడావిడి చేస్తారు. త్వరలో సమస్యకు చెక్ పేడుతామంటూ ప్రకటిస్తారు. భవిష్యత్ లో ఇలాంటి సమస్యలు రావాంటూ హామిలు ఇస్తారు. ఇక సమస్యకు పరిష్కారం లభించనట్లే అన్నట్లుగా చెప్పుకోస్తారు. వారం పది రోజుల్లో పనులు ప్రారంభం అవుతాయంటూ  చెప్పుకోస్తారు.   కాని పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది జిహెచ్ఎంసి పరిధిలో. మంత్రులు ప్రకటిస్తారు. అధికారులు చేస్తామంటారు. కాని తరువాత దానిని మూలకు వేస్తారు. ఇది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ అదికారుల పరిస్థితి. హైదరాబాద్ లో నాలా సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. పనులు చేయ్యాలంటూ పరిపాలన అనుమతులిచ్చింది. కోట్లారూపాయలు ఖర్చే చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పనులు చేయ్యమంటే సరే అంటున్న అధికారులు తరువాత వాటిని పక్కన పెడుతున్నారా అంటే అవుననే అనిపిస్తుంది బల్దియా ఇంజనీరింగ్ అదికారుల పనిచూస్తూంటే. 

 

                             మంత్రులు ప్రజా ప్రతి నిధుల ముందు పనులు ప్రారంభిస్తామని చెప్పే అధికారులు అ తరువాత దానిని పట్టించుకోరు ఎప్పుడు పనులు మొదలు పెడుతారు అస్సలు చెప్పరు. ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్నది ముసారాంబాగ్ బ్రిడ్జి.  వర్షం వచ్చిన ప్రతి సారి రాకపోకలు నిలిచిపోతున్నాయి. మూసి ఉప్పొంగితే ఒకటి రెండు రోజులు అటువైపు వాహనాలను వెళ్లనివ్వరూ అధికారులు. పూర్తిగా రోడ్డు బంద్ చేస్తారు.  దిల్ సుఖ్ నగర్..., అంబర్ పేట్ ప్రాంతాలను కలిపే ముఖ్యమైన మార్గం కావడం తో ప్రతిరోజు లక్షల సంఖ్యలో వాహనాలు ఆ మార్గంలో ప్రయాణం చేస్తాయి. ఈ ఏడాది భారీ వర్షాలు వచ్చిన పలు సందర్బాల్లో ముసారాంబాగ్ వంతనపై రాకపోకలు నిలిచిపోయాయి. జూలై  చివరి వారంలో వచ్చిన వరదలతో బ్రిడ్జి పై వరద నీరు పారింది పూర్తిగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆ ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్.., మహమూద్ అలీ లు ఇక్కడ వంతెన నిర్మాణం చేస్తామని ప్రకటించారు.  ముసి పై నిర్మించ తలపెట్టిన 15 బ్రిడ్జి లలో మొదటగా ముసారం భాగ్ వంతేన నిర్మిస్తామని..., మరో పది రోజుల్లో మూసారంబాగ్ ప్రాంతంలో  బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయని ప్రకటించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.  తొమ్మిది నెలల్లో ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి అవుతుందన్నారు. అంటే 2023 మే నాటికి వంతేన పనులు పూర్తి చేస్తామని మంత్రి ప్రకటించారు. దాంతో వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని అనుకున్నారు పబ్లీక్. కాని ఇక్కడ చూస్తూ మాత్రం ఎక్కడ వేసిన గోంగళి అక్కడే అన్నట్లుగా ఉంది పరిస్థితి.  ఇక మూడు  నెలలు పూర్తి అయినా ఇప్పటికి ఈ ప్రాజెక్టుకు సంబందించిన డిటైల్ ప్రాజెక్టు రిపోర్టు సిద్దం కాలేదు. అది కావాడానికి మరో మూడు వారాల సమయం పడుతుందంటున్నాయి బల్దియా వర్గాలు. తరువాత  టెండర్ ప్రక్రియ పూర్తి చేయ్యాలి. అప్పుడు పనులు పూర్తి కావాల్సి ఉంటుంది. అంటే అనుకున్నది అనుకున్నట్లు జరిగినా మరో రెండు నెలల సమయం పనులు ప్రారంభానికి పట్టే అవకాశం ఉంది. అంటే  రాబోయే వర్షాకాలం కూడా ఇక్కడ పబ్లిక్ కు ట్రాఫిక్ కష్టాలు తప్పేలా లేదు.  ఒక వైపు మంత్రులు చెబుతున్నారు... మరోవైపు అధికారులు మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిదిలో అనేక పనులు ఇలానే ఆలస్యం అవున్నాయి. ప్రదానంగా రోడ్డు ప్రాజెక్టులు..., నాలా  విస్తరణ.., రిటైనింగ్ వాల్ నిర్మాణం పనులు చాలా  ఆలస్యం అవుతున్నాయి. ఒకవైపు మేయర్.., ఎమ్మెల్యేలు.., మంత్రులు వేగంగా పనులు పూర్తి చేస్తామని ప్రకటిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా పరిస్థితి ఉన్నది.