మహిళల ఆర్థిక  సాధికారితకు కృషి - జిహెచ్ఎంసి

మహిళల ఆర్థిక  సాధికారితకు జిహెచ్ఎంసి విశేష కృషి

 

                      మహిళ ఆర్థిక స్వావలంబన జరిగితే కుటుంబం మొత్తం ఆర్థికంగా, సామాజికంగా ముందుకు వెళతారు అనే  ఉద్దేశంతో మహిళా అభ్యున్నతికి జిహెచ్ఎంసి దోహద పడుతున్నది. పొడుపు ద్వారా మహిళలను ఏకం చేసి మెరుగైన జీవన ప్రమాణాలను పెంపొందించడం కోసం కృషి చేస్తున్నది. ఒక వైపు బ్యాంకు రుణాలు అందిస్తూనే ఆదాయ వనరులు సృష్టికి జిహెచ్ఎంసి దోహద పడుతుంది. నగరంలో 4,846 కాలనీలు ఉండగా సుమారు 3 వేల కాలనీలలో పచ్చదనం పెంపొందించే విధంగా ఇంచు బై ఇంచు కార్యక్రమంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు అవకాశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటడం, నీరు పోయడం,  సంరక్షించడం మూడేళ్ల పాటు నిర్వహిస్తే మొదటి సంవత్సరం 100 శాతం , రెండో సంవత్సరంలో 60 శాతం, మూడో సంవత్సరం 40 శాతం నిధులు సమర్ధ నిర్వహణకుగానూ అందజేస్తారు. ఈ చర్య మూలంగా  రాష్ట్ర వ్యాప్తంగా జిహెచ్ఎంసి కి మంచి గుర్తింపును తెచ్చింది.

                            2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆరు జోన్లలో  8973 స్వయం సహాయక సంఘాలకు రూ. 467 కోట్ల 16  లక్షల విలువ గల రుణాలు అందించాలని లక్ష్యం పెట్టుకుని   ఇప్పటివరకు రూ. 372 కోట్ల 33 లక్షల 60 వేలను బ్యాంకు రుణాలు 4890 స్వయం సహాయక సంఘాలకు పంపిణీ చేయడం జరిగింది. 

ఎల్బీనగర్ జోన్ లో  రూ. 55 కోట్ల 8 లక్షల 61 వేల విలువగల రుణాలు  786 సంఘాలకు పంపిణీ చేశారు.

చార్మినార్ జోన్ లో 678 స్వయం సహాయక సంఘాల మహిళా గ్రూప్ లకు రూ.30 కోట్ల 29 లక్షల 55 వేల రూపాయలు పంపిణీ చేశారు.

ఖైరతాబాద్ జోన్ లో  రూ. 30 కోట్ల 14 లక్షల 55 వేల రూపాయల విలువ గల బ్యాంకు రుణాలు 431  మంది మహిళా గ్రూప్ లకు, పంపిణీ చేశారు.

శేరిలింగంపల్లి జోన్ లో రూ. 60 కోట్ల 76 లక్షల 60 వేల విలువ గల రుణాలు 783 గ్రూప్ లకు అందజేశారు.

కూకట్ పల్లి జోన్ లో రూ. 134 కోట్ల 54 లక్షల 68 వేలు 1228 స్వయం సహాయక సంఘాలకు అందజేశారు.
 
సికింద్రాబాద్ జోన్ లో  984 మహిళా సంఘాలకు రూ. 61 కోట్ల 49 లక్షల  61 వేలు రుణాలు పంపిణీ చేయడం జరిగింది.
 
కేటాయించిన లక్ష్యాన్ని ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి కాకుండా అంతకంటే నెల రోజుల ముందే లక్ష్యాన్ని సాధించేందుకు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.


మహిళల ఆర్థిక బలోపేతానికి కృషి : మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

మహిళలను ఆర్థిక, సామాజిక బలోపేతానికి విశేష కృషి చేస్తున్నారు. జిహెచ్ఎంసిలో అర్బన్ కమ్యూనిటీ విభాగం ద్వారా మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడానికి నైపుణ్యత, ఆర్థిక అక్షరాస్యత పై దృష్టి సారించినట్లు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. ఇప్పటివరకు జిహెచ్ఎంసి పరిధిలో  41,26,650 మంది మహిళలతో 42,165 స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసి ఇప్పటి వరకు రూ. 2910.55  కోట్ల రూపాయల విలువ గల ఆర్థిక సహాయాన్ని బ్యాంకు ల సహకారంతో  పంపిణీ చేసినట్లు మేయర్ పేర్కొన్నారు. దీంతో  మహిళ కుటుంబ ఆర్థిక  పరిస్థితులు మెరుగు పరిచేందుకు కృషి చేస్తున్నట్లు మేయర్ వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరం లో నిర్దేశించిన  467 కోట్ల 16 లక్షల లక్ష్యాన్ని   సాధించడానికి నిర్దేశించిన సమయం కంటే ముందే పూర్తికి చర్యలు తీసుకున్నట్లు అంతేకాకుండా  స్వయం ఉపాధి పథకం ద్వారా296 దరఖాస్తులు స్వీకరించ గా అందులో 261 మందికి 229 లక్షల రూపాయలను అందించినట్లు మేయర్ పేర్కొన్నారు.

దివ్యాంగుల ఆర్థిక స్వావలంబనకు కృషి: డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి

నగరంలోని వివిధ ప్రతిభావంతులు(దివ్యాంగుల) మహిళలను గుర్తించి స్వయం సహాయక సంఘాలను ఏర్పరిచి ఆర్థిక అసమానతలను తొలగించేందుకు   రుణాలు పంపిణీ చేస్తున్నట్లు డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి అన్నారు. నగరంలో   1097 గ్రూప్ లను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఈ  సంవత్సరంలో కొత్తగా మరో 74 గ్రూప్ లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు రూ.17.20 కోట్ల రూపాయల  విలువైన బ్యాంకు రుణాలు 1356 గ్రూప్ లకు  పంపిణీ చేయడం జరిగింది. ఈ సంవత్సరంలో రూ. 1.68 కోట్ల బ్యాంక్ లింకేజ్ ని  77 స్వయం సహాయక సంఘాలకు అందజేయడం జరిగిందని డిప్యూటీ మేయర్ తెలిపారు.