మరింత భారమైన వంట గ్యాస్....

-మళ్ళీ పెరిగిన చమురు ధరలు

-ఎల్పీజీ సిలిండర్‌ పై రూ.25 పెరుగుదల

- కేంద్రం బాదుడుపై జనాగ్రహం

  

      దేశంలోని సామాన్య ప్రజానీకానికి కేంద్రంలోని మోడీ సర్కారు మరో షాకిచ్చింది. రోజురోజుకూ పెరిగిపోతున్న పెట్రో ధరలతో సతమవుతున్న వారికి వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరలను పెంచుతూ భారం మోపింది. ఆయిల్‌ కంపెనీలు పొందుపరిచిన సమాచారం ప్రకారం.. దేశంలో రాయితీ సిలిండర్‌పై రూ. 25 లు , వాణిజ్య సిలిండర్‌పై రూ.184 పెరిగింది. కాగా, పెంచిన ఈ ధరలు గురువారం నుంచే అమల్లోకి వచ్చాయి. పెరిగిన ధరల ప్రకారం.. దేశరాజధాని ఢిల్లీలో వంట గ్యాస్‌ సిలిండర్‌ (14.2 కేజీలు) ధర రూ. 719గా, కోల్‌కతాలో రూ. 745.50గా, వాణిజ్యరాజధాని ముంబయిలో రూ. 719గా, చెన్నైలో రూ. 735గా ఉన్నాయి. ఇక హైదరాబాద్‌లో సిలిండర్‌ ధర నిన్నటి వరకు రూ. 746.50గా ఉన్నది. అయితే, తాజా ధరల ప్రకారం అది రూ. 771.50కు చేరుకున్నది. గతనెలలో వంట గ్యాస్‌ ధరలు పెరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న మధ్యతరగతి ప్రజలపై ఇప్పుడు పెద్ద భారం మోపడం గమనార్హం.