మధుమేహాన్ని నిరోధించవచ్చు...

  • ఈ చిట్కాలు పాటిస్తే...

ప్రస్తుతకాలంలో మనం తీసుకునే ఆహారంలో లోపం వలన చిన్నా పెద్ద వయసుతో సంబందం లేకుండా షుగర్ వ్యాధి బారిన పడుతున్నారు. సాధారణంగా మధుమేహం వ్యాధి భారినపడితే జీవితాంతం మందులు వాడాల్సిందే. కానీ ఇక్కడ తెలిపిన చిట్కాలను పాటించటం వలన వ్యాధి తీవ్రతలను తగ్గించవచ్చు. రక్తంలోని చక్కెర స్థాయిలు పెరుగుతున్నట్లయితే, మొదటగా తీసుకునే ఆహారంలో మార్పులు చేయాలి. మంచి పోషకాహార నిపుణుడిని కలిసి ఆహార ప్రణాళికను రూపొందించుకోవాలి. నాణ్యమైన మరియు పరిమిత మోతాదులో తినటం వలన అనుకూల ఫలితాలను పొందుతారు.

1. రోజూవారీ ఆహారంలో అదనంగా, కార్బోహైడ్రేట్లను తగ్గించి వీటికి బదులుగా ప్రోటీన్లను తీసుకుంటే చాలా మంచిది.

2. వ్యాయామాల వలన మధుమేహ వ్యాధి మాత్రమే కాక పూర్తి ఆరోగ్యం మెరుగుపడుతుంది.

3. రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను తగ్గించే అందుబాటులో ఉన్న మరొక సులువైన మార్గం బరువు తగ్గటం. బరువు తగ్గటం వలన ఇన్సులిన్‌కు శరీరం మరింత సున్నితంగా మారుతుంది.

4. కాకరకాయను కూరగా లేదా రసం రూపంలో తీసుకోవటం మధుమేహ వ్యాధిగ్రస్తులు మరియు సాధారణ వ్యక్తుల రక్తంలోని చక్కెర స్థాయిలలో మార్పులు సంభవించవచ్చు.

5. పచ్చని ఆకుకూరలు తినటం వలన ఆరోగ్యానికి చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. వీటితో పాటుగా మధుమేహం కూడా తగ్గించబడుతుందని కొన్ని పరిశోధనలలో వెళ్ళడయింది. ఈ పరిశోధనలలో పచ్చని ఆకుకూరలను తినటం వలన మధుమేహం బారి నుండి బయటపడవచ్చని తెలిపారు.

6. మధుమేహ వ్యాధిని తగ్గించే ప్రణాళికలో ఆహారంతో పాటు వ్యాయామాలు ముఖ్యమనే చెప్పాలి. 30 నిమిషాల ఏరోబిక్ వ్యాయామాల వలన రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు తగ్గటమే కాకుండా, ముఖ్యమైన కణజాలాలను మరింత సున్నితంగా మారుస్తుంది.