మద్యం మత్తు - అమాయకులు చిత్తు

                 హైదరాబాద్ నగరంలో రోజు రోజు కు రోడ్డు ప్రమాదాలు పేరిగిపోతున్నాయి. కోందరూ వాహనదారుల నిర్లక్ష్యం కారణంగా ఇబ్బందులు పడుతుంటే మరికోందరూ మాత్రం మద్యమత్తులో వాహనాలు నడిపి అమయాకులు ప్రాణాలను చిత్తు చేస్తున్నారు. మృతుల కుంటుంబాల్లో అంతులేని దు:ఖాన్ని నింపుతున్నారు.

 

               హైదరాబాద్ జూబ్లీహిల్స్ మరియు నార్సింగ్ ప్రాంతా్లో జరిగిన ప్రమాదాలకు కారణం మద్యం మత్తులో వాహనాలు నడపడమేనని తెల్చారు పోలిసులు. రెండు ప్రాంతాల్లో తమ దారిన తాము వెళ్తున్న నలుగురు మృత్యువాతపడ్డారు.   

 

కోద్ది గంటల్లోనే మూడు సార్లు మద్యం తాగి ప్రమాదం:

               ప్రమాదానికి ఉప్పల్ రాఘవేంద్ర కాలనీకి చెందిన రోహిత్ గౌడ్, కర్మన్ ఘాట్ కు చెందిన సాయి మరో స్నేహితుడితో కలిసి ఆదివారం రాత్రి దుర్గం చెరువు వద్దగల ఆలివ్ బిస్ట్రోలో మద్యం విందు చేసుకున్నారు. అక్కడి నుండి జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 45లో ఉన్న ఫ్యాట్ ఫిజియన్ పబ్ కు వెళ్లి అక్కడ కూడా మద్యం సేవించారు. తరువాత అక్కడి నుండి  బంజారాహిల్స్ రాడిసన్ బ్లూప్లాజా హోటల్లో మారోసారి మద్యం తాగారు. అ తరువాత రాత్రి 1.30నిముషాల ప్రాంతంలో పార్క్ హయత్ హోటల్ వైపు కు వేగంగా కారులో వెళ్లారు. అదే సమయంలో రెయిన్ బో ఆసుపత్రిలో పనిచేసే అయోద్యరామ్ దేబేంద్రకుమార్ దాస్ టీ తాడి రోడ్డు దాటుతున్నావారిని కారు నడుపుతున్న రోహిత్ గౌడ్ వేంగా డికోట్టారు. ఇద్దరూ డివైడర్ అవతలి వైపు ఎగిరి పడ్డారు. అయినా కారు అపకుండా వేగంగా వెళ్లిపోయారు ఆ యువకులు. తప్పించుకనేందుకు అన్ని విధాల ప్రయత్నం చేశారు. అయితే పోలిసులు చాకచక్యంగా వారిని పట్టుకున్నారు. అయితే మద్యం మత్తులో చేసిన డ్రైవింగ్ కు ఇద్దరు యువకులు  బలయ్యారు. 

 

ప్రమాద కారకులను వదిలేయ్యాలంటూ:

           ఇంత ఘోర ప్రమాదానికి కారణం అయిన వారిని కఠినంగా శిక్షించాలంటూ చెప్పాల్సిన ప్రజా ప్రతినిధులు...,  వదిలేయ్యాలంటూ పోలిసులకుతో మాట్లాడటం ఇప్పుడు చర్చనీయ అంశం అయ్యింది. మూగ్గురు ఎమ్మెల్యేలతోపాటు మరికోందరూ నేతలు కూడా రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. మా వాళ్లే చూసి చూడనట్లు వదిలేయమంటూ పోలిసు అధికారులపై ఒత్తిడి  చేశారు ప్రజా ప్రతినిదులు.  అయితే రోహిత్ గౌడ్ తండ్రి  ఉప్పల్ చౌరస్తాలో బార్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది.

 

దంపతులు కన్నుమూత:

               కోకాపేట్ కు చెందిన పాల వ్యాపారి రాజు, మౌనిక బార్యభర్తలు. గండిపేట్  బ్యాంకులో నగదు జమచేసేందుకు బైకుపై వెళ్లారు. అయితే రాంగ్ రూట్ లో వెళ్తున్న రాజు బైక్ ను వేగంగా వస్తున్న క్వాలీస్ వాహన డికొట్టింది. 100మీటర్ల వరకు లాక్కింది. ప్రమాదంలో  తీవ్రంగా గాయపడ్డ ఇరువురు అక్కడే మృతి చెందారు. అయితే ప్రమాదానికి కారణం అయిన కారు డ్రైవర్ మాత్రం ఫుల్ గా మద్యం తాగి ఉన్నాడు.

 

మద్యం మత్తులో కారు ప్రమాదం చేసిన వైద్య విద్యార్థులు:

             మాదాపూర్ ప్రాంతంలో  ముగ్గురు వైద్య విద్యార్తులు ఫుల్ గా మద్యం తాగి అతివేగంగా కారు నడిపి నలుగురు పాదాచారులను డీకొట్టారు.  ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన  నిఖిల్ రెడ్డి, తరుణ్, అఖిల్ ముగ్గురు స్నేహితులు ఇనార్బిట్ మాల్ ఉన్న ఫ్యూజన్ పబ్ లో మద్యం తాగి అర్థరాత్రి ఇంటికి బయలుదేరారు.  నిఖిల్ రెడ్డి కారు నడుపుతూ దుర్గం చెరువు నర్సీరి వద్ద నడుచుకుంటూ వెళ్తున్న నేపాల్ కు చెందిన గౌతమ్, పంకజ్,  వినోద్, సూరజ్ లను డికొట్టారు. దాంతో వారు తీవ్రంగా గాయాలపాలయ్యారు. వారిని స్థానికులు ఆసుపత్రిలో చెర్పించారు.  

 

             ఇలా హైదారబాద్ నగరంలో మద్యం మత్తులో నిత్యం ప్రమాదాలు జరుగుతునే ఉన్నాయి. వందల సంఖ్యలో అమాయకులు ప్రణాలు కోల్పోతున్నారు. అయితే ప్రమాదాలు చేస్తున్న వారిలో అత్యదికులు ధనవంతుల కుటుంబాలకు చెందిన వారే ఉన్నారు. ఇక ప్రమాదాలు చేసిన వారికి వెంటనే శిక్షలు పడకపోవడంతో రోడ్డుపైకి వచ్చిన వాహనదారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.