మంత్రి కేటీఆర్‌కు కరోనా పాజిటివ్

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అంతేగాకుండా.. ఇటీవల తనను కలిసిన వారందరూ జాగ్రత్తగా ఉండాలని, కరోనా టెస్టులు చేయించుకొని ఐసోలేషన్‌లోకి వెళ్లాలని సూచించారు. ప్రస్తుతం తాను హోం ఐసోలేషన్‌లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్టు తెలిపారు.