బాట సింగారం లాజిస్టిక్‌ పార్కును ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్

       సరుకు రవాణా రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకు హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసింది. అందులో భాగంగా మొదటి దశలో ఔటర్‌ రింగ్‌ రోడ్డు చుట్టూ రెండు చోట్ల లాజిస్టిక్‌ పార్కుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. రూ.40 కోట్ల వ్యయంతో బాట సింగారం వద్ద 40 ఎకరాల్లో, మంగల్‌పల్లి వద్ద 22 ఎకరాల స్థలంలో సుమారు రూ.25 కోట్లతో పీపీపీ (ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం) విధానంలో వీటిని చేపట్టారు. మంగల్‌పల్లి వద్ద నిర్మించిన లాజిస్టిక్‌ పార్కు గతేడాది ప్రారంభించిన విషయం తెలిసిందే.గురువారం(28- జనవరి) నాడు బాట సింగారం లాజిస్టిక్‌ పార్కును రాష్ట్ర పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించనున్నారు.