బల్దియా కార్మికులను పర్మనెంట్ చేయ్యాలి - గోపాల్

jబల్దియా కార్మికులను పర్మనెంట్ చేయ్యాలి - గోపాల్

              జిహెచ్ఎంసిలో పనిచేస్తున్న  కార్మికులను పార్మనెంట్ చేయ్యాలని డిమాండ్ చేశారు జిహెచ్ఎంసి ఎంప్లాయిస్ నేత గోపాల్. కాంట్రాక్టు .., ఔట్ సోర్సీంగ్ విధానంలో దాదాపు 26వేల 5వందల మంది పనిచేస్తున్నారని వారందరికి చట్టప్రకారం వేతనాలు చెల్లించాలన్నారు. ఇప్పటికే హైకోర్టు కోంతమందిని రెగ్యులరైజ్ చేయ్యాలని ఆదేశించిందని..., ఇతర కార్మికులు కూడా ఇప్పుడు కోర్టుకు వెళ్లారన్నారు. కోర్టు తమకు అనుకూలంగా తీర్పునిస్తుందని ఆశిస్తున్నామన్నారు. ఇటివల కార్మికులకు వేతనాలు పెంచామని ప్రకటించిన ఇప్పటికి కార్మికులకు అందలేదన్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా చాలా మంది కార్మికులకు ఇప్పటికీ జీతాలు అందలేదన్నారు. అధికారులు స్పందించకుంటే  జనవరి 6 నుండి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.