ప్రపంచ వ్యాప్తంగా 15లక్షలు

ప్రపంచ వ్యాప్తంగా 15లక్షలు

88వేల మంది మృతులు

అత్యదికంగా ఇటలీలో 17వేలు

ఐదుదేశాల్లో లక్షకు పైగా పాజిటివ్ కేసులు

 

 

                    ప్రపంచంలో రోజు రోజు కు కరోనా కేసులు పేరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 15లక్షల మార్కును దాటింది.  ఇందులో మృతులు  88వేలకు పైగా ఉన్నారు. 40వేల మందికి క్రిటికల్ పోజిషన్ లో ఉన్నారు.  వరల్డ్ వైడ్ గా 3లక్షల 30వేల వరకు రోగులు రికవర్ అయ్యి డిశ్చార్జీ అయ్యారు.  ప్రదానంగా యూరప్ దేశాలతోపాటు అమెరికాలో భారీగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మరణాలు కూడా భారి సంఖ్యలో ఉన్నారు. లక్షకు పైగా కరోనా కేసులు అమెరికా, స్పెయిన్, ఇటలీ, జర్మనీ, ప్రాన్స్ దేశాల్లో నమోదు అయ్యాయి.   

 

                   అమెరికాలో అత్యదికంగా 4లక్షల 35 వేల మంది ఈ మహ్మమారి భారిన పడగా 14,795మంది మృత్యువాత పడ్డారు. ఇలా ప్రపంచంలోనే అత్యదిక పాజిటివ్ కేసులు  అమెరికాలో ఉన్నాయి. తరువాతి స్థానంలో ఉన్న స్పెయిన్ లో 1లక్షా 48వేల పాజిటివ్ కేసులు 14,792 మృతులు ఉన్నాయి. ఇక మూడవ స్థానంలో ఉన్న ఇటిలీలో 1లక్షా 39వేల మంది ప్రజలు కరోనా భారినా పడగా ప్రపంచంలోనే అత్యదికంగా 17,669మంది మృత్యువాత పడ్డారు.  జర్మని లో 1లక్షా 13వేల మందికి పాజిటివ్ ఉండగా 2,349మంది మృతి చెందారు.  ఫ్రాన్స్ 1లక్షా 12వేల మంది భాదితులు ఉండగా 10,869మంది మృత్యువాతపడ్డారు. 

                    అమెరికాలో అత్యదికంగా ఎక్కువగా మంది ప్రజలు ఈ వ్యాది  భారిన పడుతున్నారు. అయితే న్యూయార్క్ లో ఈ వ్యాది ప్రభావం భారిగా ఉంది.