ప్రజలను ఇబ్బందులు పెట్టోద్దు

 

           ఇంటి అద్దేలను మూడు నెలల అడగోద్దు ముఖ్యమంత్రి  కేసిఆర్.

           స్కూల్ ఫిజులు పెంచవద్దు.

           నెల నెల వసూలు చేయ్యాలి అంత ఒక్కసారి చేయ్యవద్దు. 

           పేదలకు మళ్లి బియ్యం డబ్బులు పంపిణి చేస్తాం.

 

                   అద్దేకు ఉన్న వారినుండి మార్చి ఎప్రిల్ మే నెలల్లో కిరాయి దారులనుండి డబ్బులు వసూలు చేయ్యవద్దు. ఇది  చట్టం ప్రకారం ఆర్డర్. కిరాయి దారులను సతాయించ వద్దన్నారు ముఖ్యమంత్రి.  దానిపై వడ్డి వసూలు చేయ్యవద్దు. వాయిదాల పద్దతిలో వసూలు చేసుకోవచ్చన్నారు. ఆస్తి 2019 - 20 చెల్లింపులో కూడా ఆపరాద రుసుము లేకుండా చెల్లించే అవకాశాన్ని మంత్రి మండలి కల్పించింది.

 

                  ప్రయివేటు పాఠశాలల్లో 2020-21 విద్యా సంవత్సరానికి ఫిజు పెంచడానికి వీలు లేదని మంత్రి మండలి అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నదన్నారు ముఖ్యమంత్రి కేసిఆర్. ఎవ్వరూ ఫిజులు పెంచవద్దు. ఇతర రకరకాలా ఫిజులు వసూలు చేయ్యవద్దు. కేవలం ట్యూషన్ ఫిజు మాత్రమే వసూలు చేయ్యాలి. అది నెల వారిగా మాత్రమే వసూలు చేయ్యాలి. మొత్తం ఒకే సారిచెల్లించమని చెప్పవద్దు. అతిక్రమిస్తే 100డయల్ చేయ్యాండని పిలుపునిచ్చారు కేసిఆర్. ప్రజలకు ఆదాయం లేనందునా అందరూ ఒకరికి ఒకరూ సహకరించుకోవాలి.

 

                మార్చి మాసంలో ఇచ్చినట్లుగానే 12కేజీల ఉచిత బియ్యం, ప్రతి కుటుంబానికి 1500రూపాయలు కూడా అందిస్తాము.  అకౌంట్లో డబ్బులు వేశాక అవి మీకే ఉంటాయి వాపస్ పోవు. కాబట్టి  ఒకేసారి అందరూ వెళ్ల వద్దు.  పెంక్షన్లు ఎలాంటి కోత లేకుండా అందిస్తాము. వలస కూలీలకు మరో నెల భత్యం అందిస్తారు. ప్రతి మనిషికి 12కేజీల బియ్యం, ఒకరికి 500రూపాయలు, కుంటుంబం ఉంటే 1500రూపాయలు ఇస్తాము.