పెడెస్టేరియన్ ఫ్రెండ్లీ గా పాదచారుల వంతెనలు

పెడెస్టేరియన్ ఫ్రెండ్లీ సిటీ హైదరాబాద్ 


               పాదచారులకు అనుకూలమైన నగరంగా హైదరాబాద్ పరిగణించవచ్చు. నగరంలో ప్రపంచ స్థాయి పరిశ్రమలు నెలకొల్పడం, ఇతర ప్రాంతాల నుండి ప్రతి యేటా లక్షలాది మంది ఇక్కడే సెటిల్ అవ్వడంతో నగరంలో వాహన రద్దీ ఎక్కువగా  పెరిగింది. దీంతో పాదచారులు ఇరువైపులా సురక్షితంగా రోడ్డు దాటడం గగనతరంగా మారింది. అందు కోసం పాదచారుల రక్షణ, భద్రతకు  జిహెచ్ఎంసి విస్తృతమైన చర్యలు చేపట్టింది. పాదచారులకు ప్రమాదాలు సంభవించకుండా ఫుట్ పాత్ లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జి ల నిర్మాణాలు చేపట్టి వారి భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ముందుగా ప్రమాదాలు సంభవించే ప్రాంతాలను గుర్తించి ప్రమాదాల నివారణకు ప్రత్యేక చొరవ తీసుకోవడం జరుగుతుంది.

                    ముఖ్యంగా జిహెచ్ఎంసి పరిధిలో పాదచారుల ప్రయోజనం కోసం ఫుట్  పాత్  నిర్మాణం చేపట్టడం జరిగింది. అంతేకాకుండా రోడ్డు సురక్షితంగా దాటేందుకు పాదచారుల కోసం సిగ్నల్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి తోడు ఫుట్ ఓవర్ బ్రిడ్జి లను నిర్మించి పెడెస్టేరియన్  ఫ్రెండ్లీ నగరంగా తీర్చిదిద్దడం జరిగింది. 

 
                               జిహెచ్ఎంసి పరిధిలో నగరం నలువైపులా అవసరమైన ట్రాఫిక్ రద్దీ అంచనా వేసి పాదచారులకు ప్రమాదాల నివారణకు ముమ్మర చర్య లు తీసుకున్నారు. అందులో భాగంగా సురక్షితంగా రోడ్డు దాటేందుకు పాదచారుల కోసం 94 పెడెస్టేరియన్ సిగ్నల్ ఏర్పాటు చేశారు. రోడ్డు దాటి సందర్భంలో స్వయంగా పాదచారులు ఈ సిగ్నల్  లను ఉపయోగించుకునే వెసులుబాటు ఉంది. అంతేకాకుండా తెలంగాణ రాకముందు 415 కిలోమీటర్లు ఉన్న ఫుట్ పాత్  తెలంగాణ తర్వాత ఇప్పటి వరకు 817 కిలోమీటర్లను రూ. 32.75 కోట్ల వ్యయంతో నిర్మాణం చేశారు. దానికి తోడు ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో  అవసరమైన ప్రదేశాలలో  పాదచారులకు ఫుట్ ఓవర్ బ్రిడ్జి ల నిర్మాణాలు చేపట్టడం జరిగింది. జిహెచ్ఎంసి పరిధిలో  గతంలో 20 ఫుట్ ఓవర్ బ్రిడ్జి లను నిర్మించి అందుబాటులోకి తెచ్చారు. తర్వాత  పెరుగుతున్న  జనాభాకు అనుగుణంగా మరో 22  ఫుట్ ఓవర్ బ్రిడ్జి లను రూ. 75.65 కోట్లతో చేపట్టడం జరిగింది. ఇప్పటి వరకు 8 ఫుట్ ఓవర్ బ్రిడ్జి లు అందుబాటులోకి రాగ మిగతావి త్వరలో అందుబాటులోకి రానున్నాయి.

                         సిగ్నల్స్, ఫుట్ పాత్ , ఫుట్ ఓవర్ బ్రిడ్జి లే కాకుండా నగరంలో ఇటీవల జోన్ కు 2 చొప్పున ప్రయోగాత్మకంగా చేపట్టిన 12 జంక్షన్లను విస్తరణ, అభివృద్ధి,  సుందరీకరణ పనులు చేపట్టడం జరుగుతుంది. అందులో కూడా పాదచారులకు ప్రయోజనం కల్పించబడింది. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో పాదాచారులు హడాహుడికి ఆస్కారం ఇవ్వకుండా ప్రశాంతంగా వెళ్లేందుకు సిట్టింగ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ 12 జంక్షన్ లలో కొన్ని జంక్షన్ అభివృద్ధికి సి ఎస్ ఆర్ పద్ధతిలో చేపట్టుటకు ముందుకు వచ్చారు. ప్రస్తుతం అట్టి పనులు వివిధ అభివృద్ధి దశలో కలవు. నగరంలో మరో 102 జంక్షన్ అభివృద్ధికి , సుందరీకరణ పనులు చేపట్టి ట్రాఫిక్ నియంత్రణ తో పాటుగా పాదచారుల భద్రతకు కూడా ప్రాధాన్యత నిచ్చారు. ప్రజా రవాణా వ్యవస్థను పటిష్టం చేయడానికి  హైదరాబాద్ మెట్రో రైల్ ఆధ్వర్యంలో చేపట్టిన 60 మెట్రో రైలు స్టేషన్ ల వద్ద కూడా పాదచారుల రక్షణ, ప్రమాదాల నివారణ కోసం రోడ్డు  దాటకుండ రెండువైపులా వెళ్లేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జి  నిర్మాణాలను చేపట్టిన విషయం తెలిసిందే. ఫుట్ ఓవర్ బ్రిడ్జి ల వలన ( pedestrian friendly  facilities city of Hyderabad ) పాదచారుల అనుకూల నగరంగా హైదరాబాద్ నిలుస్తుందని చెప్పవచ్చును.


*ఇప్పటి వరకు పూర్తి అయిన ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు (పాతవి)*


1. కాప్రా సర్కిల్ లోని రాధిక సైనిక్ పురి మెయిన్ రోడ్డు ఏ.ఎస్.రావు నగర్, 2.  నేషనల్ పోలీస్ అకాడమీ రాజేంద్రనగర్, 3. నియర్ మహవీర్ హాస్పిటల్, 4. నియర్ ఎం.డి.సి మాసబ్ ట్యాంక్, 5. ఎన్టీఆర్ మార్గ్, 6. సి.ఎం క్యాంప్ ఆఫీస్ గ్రీన్ ల్యాండ్ గెస్ట్ హౌస్, 7. ఎల్.వి.ప్రసాద్ ఐ హాస్పిటల్, రోడ్ నెం.2 బంజారాహిల్స్, 8. ముఫఖం జా కాలేజ్ రోడ్ నెం.3 బంజారాహిల్స్, 9. భారతీయ విద్యా భవన్ స్కూల్, రోడ్ నెం.82, జూబ్లీహిల్స్, 10. నియర్  ఎన్.ఎస్.ఎల్ దివ్య శ్రీ, రాయదుర్గం (వెల్స్ ఫోర్గో ఖాజాగూడ), 11. ఏ.టి ఐ.ఎస్.బి విప్రో, 12. ఐ.టి.సి కోహినూర్, 13. నియర్ ఓల్డ్ పోలీస్ స్టేషన్ మియాపూర్, 14. నియర్ లక్ష్మి విలాస్ రెస్టారెంట్ మదీనగూడ, 15. నియర్ మలేసియా టౌన్ షిప్ కూకట్ పల్లి, 16. నియర్ 4వ ఫేజ్, కే.పి.హెచ్.పి కాలనీ, 17. కళామందిర్ ఎదురుగా నేషనల్ హైవే 65, 18. గుడ్డెన్మెంట్, 19. రైల్వే నిలయం ఎదురుగా, 20. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బేగంపేట్ తదితర ప్రాంతాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు కలవు


నూతనంగా 75.65 కోట్ల వ్యయం తో చేపట్టిన 22 ఫుట్ ఓవర్ బ్రిడ్జిల లో రూ.28.10 కోట్ల విలువ గల  8  అందుబాటులోకి వచ్చాయి.

కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జి లు

చెన్నై షాపింగ్ మాల్ మదీనా గూడ


యశోద పియరల్ కాంప్లెక్స్  మియాపూర్


హైదరాబాద్ సెంట్రల్ మాల్, పంజాగుట్ట


NS KK స్కూల్ దగ్గర బాలానగర్


నేరెడ్మెట్ బస్ స్టాప్

 

సెయింట్ ఆన్స్ స్కూల్,  సికింద్రాబాద్


స్వప్న థియేటర్  రాజేంద్ర నగర్


 ఈ ఏస్ ఐ హాస్పిటల్  ఎర్రగడ్డ


చేపట్టిన 22 ఫుట్ ఓవర్ బ్రిడ్జి లో  బంజారా హిల్స్ లో  3డి ఎఫెక్ట్ తో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టారు.