పూణే విజిట్ మేయర్ టీం

పూణే విజిట్ మేయర్ టీం

 

                     పూణె మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ద్వారా చేప‌ట్టిన ప‌లు ఇంజ‌నీరింగ్ ప‌నులు, పార్కుల నిర్వ‌హ‌ణ‌, ఫుట్‌పాత్‌ల నిర్మాణం త‌దిత‌ర అంశాల‌ను హైద‌రాబాద్ న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ నేతృత్వంలోని జిహెచ్ఎంసి అధికారుల బృందం నేడు ప‌రిశీలించింది. మంగ‌ళ‌వారం నాడు నాగ్‌పూర్‌లో మెట్రోరైలు, ఇత‌ర  నిర్మాణాల‌ను ప‌రిశీలించిన మేయ‌ర్ రామ్మోహ‌న్ నేతృత్వంలోని అధికారుల బృందం నేడు పూణె న‌గ‌రంలో ప‌ర్య‌టించారు. జిహెచ్ఎంసి చీఫ్ ఇంజ‌నీర్లు శ్రీధ‌ర్‌, జియాఉద్దీన్‌, ఓ.ఎస్‌.డి సురేష్‌లు మేయ‌ర్ తో క‌లిసి పూణెలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా పూణె న‌గ‌రంలోని ర‌హ‌దారుల‌కు ఇన్‌స్టాంట్‌గా మ‌ర‌మ్మ‌తులు నిర్వ‌హించేందుకు ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన మొబైల్ మ‌ర‌మ్మతుల వాహ‌నాన్ని ప‌రిశీలించారు. పూణె స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా చేప‌ట్టిన ప‌లు వినూత్న కార్య‌క్ర‌మాల‌ను కూడా ప‌రిశీలించారు. ముఖ్యంగా పార్కుల్లో సంద‌ర్శ‌కుల సౌక‌ర్యార్థం ఏర్పాటుచేసిన ఏకో ఫ్రెండ్లీ సీటింగ్ ఏర్పాట్లు, సోలార్ ట‌వ‌ర్ యూనిట్లు, ఓపెన్ జిమ్‌ల ఏర్పాటు, వాటి నిర్వ‌హ‌ణ‌ను మేయ‌ర్ ప్ర‌త్య‌క్షంగా తెలుసుకున్నారు. పార్కుల్లో వ‌ర్ష‌పనీరు ఇంకేలా నిర్మించిన ఇంకుడు గుంత‌ల నిర్మాణాన్ని ప‌రిశీలించారు.  వీటితో పాటు న‌గ‌రంలోని ఫుట్ పాత్‌ల‌పై కేవ‌లం పాదాచారులు మాత్ర‌మే  వెళ్లేలా ఏర్పాటు చేసిన బొల్లాడ్స్ ను చూశారు. ఫుట్‌పాత్‌ల‌పై న‌గ‌ర‌వాసులు కూర్చునేవిధంగా వినూత్న ఆకారంలో ఏర్పాటుచేసిన ఛైర్ల‌ను ప‌రిశీలించారు. పూణె న‌గ‌రంలో ప‌లు ప్ర‌ధాన జంక్ష‌న్లు, ర‌హ‌దారుల‌పై ఏర్పాటుచేసిన ప‌బ్లిక్ టాయిలెట్ల నిర్వ‌హ‌ణ విదానాన్ని తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా పూణె మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఆధ్వ‌ర్యంలో అమ‌లవుతున్న హైకెపాసిటీ మాస్ ట్రాన్సిట్‌రూట్, బ‌స్ రాపిడ్‌ ట్రాన్సిట్ రూట్‌, సైక్లింగ్ ప్లాన‌, స్మార్ట్ ఫెడెస్టేరియ‌న్ స్ట్రీట్ ప్రాజెక్ట్‌ల వివ‌రాల‌ను మేయ‌ర్ రామ్మోహ‌న్‌కు అధికారులు తెలిపారు.