పుస్తక పఠనం అవసరం - మేయర్

                విద్యార్థి దశలో ఏవిధంగా ఆలోచించాలి, ప్రవర్తన ఏ విధంగా  వ్యవహార శైలి అనే అంశాల సెయింట్ ప్యాట్రిక్స్  హై స్కూల్  పూర్వ విద్యార్థి డాక్టర్  జి.అశోక్ రచించిన డియర్  యంగ్ స్టార్స్  పుస్తకాన్ని మంగళవారం మేయర్ గద్వాల విజయలక్ష్మి  జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో గల తన ఛాంబర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ...30 ప్రశ్నలతో కూడిన ఈ పుస్తకంలో విద్యార్థులు వ్యవహార శైలి, విద్య వికాసం ఆలోచన విధానం  పై ఈ పుస్తకంలో సవివరంగా వివరించారు. ప్రతి ఒక్కరూ పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలి అన్నారు మేయర్. విద్యార్థులకు ఈ పుస్తకం భవిష్యత్తులో సమస్యలకు పరిష్కారంగా ఉండబోతుందని  యువతరానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని  మేయర్ అన్నారు.