పాకిస్థాన్‌లో తొలి హిందూ మహిళా జ‌డ్జిగా సుమ‌న్ కుమారి

పాకిస్థాన్‌లో తొలిసారిగా ఓ హిందూ మ‌హిళ సివిల్ జ‌డ్జిగా నియ‌మితుల‌య్యారు. పాకిస్థాన్‌లోని హైద‌రాబాద్‌లో ఎల్ఎల్బీ ప‌రీక్ష ఉత్తీర్ణ‌త సాధించిన ఆమె క‌రాచీలోని స్జేబిస్ట్ యూనిర్సిటీ నుంచి న్యాయ‌శాస్త్రంలో మాస్ట‌ర్స్ పూర్తి చేసింది. ఖాంబ‌ర్ -షాదాద్‌కోట్‌కు చెందిన సుమ‌న్ కుమారి.. త‌న సొంత జిల్లాలోనే బాధ్య‌త‌లు నిర్వ‌హించ‌నుంది. కాగా పాక్‌లో తొలి హిందూ జ‌డ్జిగా రాణా భ‌గ‌వ‌న్ దాస్‌2005-07 వ‌ర‌కూ ప‌నిచేశారు.