పసికందు ప్రాణం నిలిసిన సోనూ సూద్...

   ఓ చిన్నారి ప్రాణం కాపాడి మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నాడు రియల్ హీరో సోనూ సూద్. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లాకు చెందిన మహేశ్, లక్ష్మీప్రియ దంపతులు. వీరికి 51 రోజుల క్రితం బాబు జన్మించాడు. బాబు ఏడు నెలలకే పుట్టడంతో కేవలం 900 గ్రాముల బరువుతో అనారోగ్యంగా ఉన్నాడు. అంతేకాకుండా పసికందు కడుపులో ఇన్ ఫెక్షన్ అయ్యింది. దీంతో చిన్నారికి అత్యవసర చికిత్స నిమిత్తం స్టార్ చిల్డ్రన్స్ హాస్పిటల్లో చేర్పించారు. లక్షరూపాయలు పెట్టి చికిత్స అందించినా బాబు ఆరోగ్యం కుదుటపడకపోవడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని రెయిన్ బో హాస్పిటల్ కు తరలించారు.

  మహేశ్ ఓ ప్రైవేట్ ఉద్యోగి కావడంతో ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంది. ఈ నేపథ్యంలో కనీసం ఆసుపత్రి బిల్లు చెల్లించలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. చిన్నారి ఆరోగ్యం, కుటుంబ పరిస్థితి గురించి కరీంనర్ కు చెందిన దీపక్ మిరానీ ఫోన్ లో సోను సూద్ కు వివరించాడు. వెంటనే స్పందించి సోనూ రెయిన్ బో వైద్యులతో మాట్లాడి బిల్లను చెల్లి చిన్నారి ప్రాణాలు కాపాడాడు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. 900 గ్రాములతో జన్మించిన చిన్నారి ఇప్పుడు 1200 గ్రాముల బరువు కు ఎదుగుదల ఉందని, చిన్నారి క్షేమంగా ఉన్నాడని వైద్యులు తెలిపారు.