నిరుపయోగంగా ఫీడ్ ద నీడ్ సెంటర్లు

 

 

          హైద‌రాబాద్ న‌గ‌రంలో అబాగ్యుల‌కు పుడ్ అందించేందుకు ప్రత్యేక ఎర్పాటు  చేసింది బ‌ల్దియా. త‌మ  ఇళ్ల‌లో..., హోట‌ల్లో...,  ఫంక్ష‌న్ హాళ్ల‌లో మిగిలిపోయిన ఆహారాన్ని నీడీ పిపుల్ కు అందించాల‌ని డిసైడ్ చేసిన అధికారులు ప్రత్యేకంగా సెంటర్లు ఏర్పాటు చేశారు.   న‌గరంలో ఆకలితో అలమటించే పేద ప్రజల ఆకలి తీర్చాలనే లక్ష్యంతో  ఏర్పాటు చేసిన ఫీడ్ ద నీడ్ సెంటర్లు నిరుపయోగంగా మారాయి.

 

             గ్రేట‌ర్ ప‌రిధిలో ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు చెప‌డుతున్న జిహెచ్ఎంసి స‌రికోత్త‌గా పిడ్ ద నీడ్ అనే  కార్య‌క్ర‌మ‌న్ని ప్రారంభించింది.  ఐదు రూపాయ‌ల‌కే అన్నం పెడుతున్న బ‌ల్దియా... అభాగ్యుల‌కు అన్నం పెట్టేలా ఈ ప్లాన్ చేసింది. అందుకోసం సిటిలోని వివిధ ప్రాంతాల్లో ఫ్రిడ్జ్ లు ఎర్పాటు  చేసి మిగిలిపోయిన ఆహారాన్ని అవ‌స‌రం ఉన్న వారికి అందించేలా  చ‌ర్య‌లు తీసుకున్నారు. జిహెచ్ఎంసి అధికారులు ప్రారంభంలో హడావిడి చేయడం ఆ తర్వాత వదిలేయడం అనేది అనేక సందర్భాల్లో కనిపిస్తుంది. ఫీడ్ దా నీడ్ సెంటర్ల కూడా బల్దియా అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. నగరవాసులు తమ తమ ఇళ్లల్లో మిగిలిపోయిన ఆహారాన్ని ఈ ఫ్రిజ్ ల వద్ద పెట్టడం ద్వారా అవసరమైన వ్యక్తులు దానిని తీసుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని ప్రత్యేకంగా ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు జిహెచ్ఎంసి అధికారులు. కొద్దిమంది స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిహెచ్ఎంసి సమీపంలోని హోటల్ ఫంక్షన్ హాల్స్ వంటి వాటిని అనుసంధానం చేయాలని నిర్ణయించింది. దాంతో అక్కడ మిగిలిపోయిన ఆహారాన్ని ఈ ఫ్రిజ్లో భద్రపరిచి అవసరమైనవారికి అందించాలని నిర్ణయించారు. వీటిని నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు జిహెచ్ఎంసి అధికారులు.

                   ఈ ప్రిడ్జ్ ల‌లో ఒక‌వైపు వెజ్ మ‌రో వైపు నాన్ వెజ్  ఫుడ్ భద్ర పరిచేలా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. కానీ అధికారులు నిర్లక్ష్యంతో ఇదిగో ఇలా ఎందుకు ఉపయోగపడకుండా పోయాయి ఫీడ్ ద నీడ్ సెంటర్లు. ఇవి ప్రారంభంలో చాలా మంచిగా ఉపయోగపడ్డాయని చాలామంది ఇక్కడ ఆహారం తినే వారు అని చెబుతున్నారు స్థానికులు వాటి నిర్వహణ పట్టించుకోకపోవడంతో ఎందుకు పనికిరాకుండా పోతున్నాయని అంటున్నారు. సిటిలో ఇప్ప‌టికే 150సెంట‌ర్ల‌లో 5రూపాయ‌ల కేంద్రాల‌ను ఎర్పాటు చేశారు  జిహెచ్ఎంసి అధికారులు.  ప్ర‌స్తుతం ప్ర‌తి రోజు 40వేల మంది ప్ర‌జ‌లు త‌మ ఆక‌లిని తీర్చుకుంటున్నారు.  అయినా చాలా మంది ఇంక ఆక‌లితో ఉన్నార‌ని వారికి ఉప‌యోగ‌క‌రంగా ఉండేలా చూసేందుకే పిడ్ ద నీడ్ సెంట‌ర్ల‌ను ఎర్పాటు చేస్తున్నామ‌ని అప్పట్లో ప్రకటించారు బ‌ల్దియా క‌మీష‌న‌ర్.   త‌మ త‌మ ఎస్టాబ్లిష్మెంట్ వ‌ద్ద మిగిలిపోయిన  పుడ్ ను స‌మీపంలోని కేంద్రాల వ‌ద్ద ఉంచాల‌ని అక్క‌డ అవ‌స‌రం అయిన వారు వాటిని తింటార‌ని తెలిపారు క‌మీష‌న‌ర్. రానున్న రోజుల్లో మ‌రింత పెద్ద ఎత్తున పీడ్ ద నీడ్ కేంద్రాల‌ను ఏర్పాటు చేసి.. ఫుడ్ స‌ప్ల‌య్ చేస్తామ‌ని ప్రారంభంలో చెప్పారు అధికారులు. ఎవ‌రైన హోటల్స్ య‌జ‌మానులు ఫుడ్ వెస్ట్ చేయ‌కుండా ఫీడ్ ద నీడ్ సెంట‌ర్ల‌కు స‌ప్ల‌య్  చేసే విధంగా ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు. ఇంతవరకు మంచిగానే ఉన్నా ఆ తరువాత వాటిని మెయింటెనెన్స్ చేయడంలో జిహెచ్ఎంసి విఫలం అయ్యింది. ఇలాంటి ఫ్రిడ్జుల వద్ద ప్రత్యేకంగా మెయింటెనెన్స్ కోసం ఒక మనిషి ఉండాలి అంటున్నారు వైద్యులు. కొన్ని రకాల ఆహారాలు కొద్ది గంటల వ్యవధిలోనే వినియోగించాలని లేదంటే అవి పాడైపోతాయి అని వాటిని తినేవారు అనారోగ్యం పాలు అవుతారని అంటున్నారు. జిహెచ్ఎంసి చేపట్టిన కార్యక్రమం చాలా మంచిదని అయితే తగిన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం కొన్ని ఇబ్బందులు వస్తాయని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ పాడైన ఆహారం ఎవరైనా  తింటే వారు అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉందని అలాంటి పరిస్థితి లేకుండా నిత్యం శుభ్రంగా ఉంచాల్సిన అవసరం ఉంది అంటున్నారు...

 

                  న‌గ‌రంలో   ప‌లు ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ ఏర్పాటుచేసిన ఫీడ్ ద నీడ్ కేంద్రాలు  పేద ప్ర‌జ‌ల‌కు.. అభాగ్యులకు కడుపు నింపే కేంద్రాలుగా ఉండేవి.  బల్దియా అధికారుల నిర్లక్ష్యం కారణంగా అనేక ప్రాంతాల్లో సెంటర్లు నిరుపయోగంగా మారాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు వీటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.