నియంత్రిత సాగు పై ప్రభుత్వం యూటర్న్..

ఇష్టం వచ్చిన పంట వేసుకోవచ్చు..

నియంత్రిత సాగు పై ప్రభుత్వం యూటర్న్..

వ్యవసాయ సమీక్ష నిర్వహించిన కేసిఆర్..

గతేడాది ప్రభుత్వం చెప్పిన పంటలు వేయ్యాలన్న కేసిఆర్..

నియంత్రిత పంటలు వేయ్యకుంటే రైతుబందుపై సమీక్ష చేస్తామన్న ప్రభుత్వం..

సన్నాలతో భారీగా నష్టపోయిన రైతులు..

తీవ్ర విమర్శలపాలైన ప్రభుత్వం..

 

             తెలంగాణలో నియంత్రిత సాగు విధానం అవసరం లేదని ప్రకటించింది ప్రభుత్వం. రైతులు ఏ పంట వేయ్యాలనే అంశంపై ఎలాంటి మార్గదర్శలు జారీ చేయ్యదని స్పష్టం చేసింది. ఏ పంటలు వేయ్యాలనే అంశంపై రైతులు నిర్ణయం తీసుకోవచ్చని వెళ్లడించింది.  రైతు వేదికల్లో రైతులు అధికారులు ఎ పంట వేస్తే ఎక్కువ ఉపయోగమే చర్చించుకోని ముందుకు వెళ్లాలని సూచించింది. 

          తెలంగాణాలో పంటల కోనుగోలు.., యాసంగి రైతు బందు విడుదల నేపథ్యంలో సిఎం కేసిఆర్ అధికారులతో సమీక్షించారు.  పంటలకోనుగోళ్ల విషయంలో ప్రభుత్వని భారీగా నష్టం వచ్చినట్లు అధికారులు సిఎం దృష్టికి తెచ్చారు. 2014నుండి ఇప్పటి వరకు 7,500కోట్ల మేరా పంటల కోనుగోలు ద్వారా నష్టం వచ్చినట్లు చెప్పుకోచ్చారు అధికారులు.  కరోనా నేపథ్యంలో గ్రామాల్లో పంటలకోనుగోలు చేశామని వచ్చే ఏడాది నుంది గ్రామాల్లో పంట్టకోనుగోలు సాధ్యం కాదని అధికారులు సిఏం దృష్టికి తెచ్చారు. 

           రైతుబందు పథకంలో భాగంగా ప్రతి ఎకరాకు 5వేల రూపాయల చోప్పున అందించాలని నిర్ణయించారు అధికారులు.