నగర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మేయర్, డిప్యూటీ మేయర్

     గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్  మేయర్ గద్వాల్ విజయలక్ష్మి  నగర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
2022 సంవత్సరంలో జిహెచ్ఎంసి ద్వారా అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించామని అన్నారు. ముఖ్యంగా ఎస్.ఆర్.డి.పి, ఎస్ ఎన్ డి పి ఇతర సామాజిక మౌలిక సదుపాయాల రంగంలో కూడా ఆశించిన అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు.


  నూతన సంవత్సరంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దిశ నిర్దేశం మంత్రి కేటీఆర్ మార్గదర్శకత్వంలో  కమిషనర్ డి ఎస్ లోకేష్ కుమార్  విశేష కృషి, అధికారులు, సిబ్బంది సమన్వయ కృషి, కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధుల సలహాలు, సూచనలతో గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగంలో ముందుకు తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని, మేయర్ అన్నారు.


 నూతన సంవత్సర వేడుకలు ప్రజలు  ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి లు ప్రజలను కోరారు.